జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా భారతదేశం కఠిన చర్యలు తీసుకున్న కొన్ని రోజుల తర్వాత, పాకిస్తాన్ సైన్యం నియంత్రణ రేఖ (LOC) వద్ద కాల్పులు ప్రారంభించింది. పాకిస్తాన్ సైన్యం పలు ప్రాంతాల్లో కాల్పులు ప్రారంభించిందని భారత సైన్యం చెబుతోంది. భారత సైన్యం ప్రతిగా కాల్పులు జరిపింది. ఇప్పటివరకు, భారతదేశం వైపు ఎవరూ గాయపడలేదు. పాకిస్తాన్ సైనిక పోస్టుల సమీపంలోని గ్రామాల ప్రజలు బంకర్లను శుభ్రం చేయడం ప్రారంభించారు. సరిహద్దు సమీపంలోని గ్రామాల ప్రజలు కూడా అత్యవసర సామాగ్రిని సిద్ధం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత మొదలైన కాల్పుల కారణంగా గ్రామస్తులు ప్రస్తుతం భయం భయంగా బతుకుతున్నారు, పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉందని అంటున్నారు. పలు ప్రాంతాల్లో భద్రతా దళాలు హై అలర్ట్‌లో ఉన్నాయి. ప్రభుత్వం పౌరులను జాగ్రత్తగా ఉండాలని కోరింది.
ఇంతలో, కశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి భారత రాఫెల్ జెట్‌ను పాకిస్తాన్ సైన్యం కూల్చివేసిందనే వాదనతో విమాన ప్రమాదం జరిగినట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. ఇది మహారాష్ట్రలోని నాసిక్‌లో వైమానిక దళ సుఖోయ్ ఫైటర్ జెట్ కూలిపోవడాన్ని చూపించే పాత వీడియో.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని గూగుల్ సెర్చ్ చేయగా, ఒక X యూజర్ అదే వీడియోను షేర్ చేశారు. దానితో పాటు క్రాష్ అయిన ఫైటర్ జెట్ ఇతర చిత్రాలను కూడా పోస్టు చేశారు. “#BREAKING: Sukhoi fighter jet of Indian Air Force has crashed in Nashik of Maharashtra. The pilot & co-pilot have ejected safely before the incident. More details are awaited.” అంటూ పోస్టు పెట్టారు.
“Bad News coming in from #Nashik. Airforce #Fighter Aircraft #Su30 MKI crashed at Shirasgaon in Nishad taluka. Pilot & Co Pilot ejected Safely. Right now it is with #HAL for overhauling. It was on training sortie. Enquiry ordered." అంటూ మరో ఎక్స్ యూజర్ కూడా జూన్ 2024లో వీడియోను పోస్టు చేశారు. నాసిక్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుందంటూ ఈ పోస్టుల ద్వారా తెలుస్తోంది. ట్రైనింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ఈ మీడియా నివేదికలు తెలియజేస్తున్నాయి.
జూన్ 2024లో
ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం, భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ యుద్ధ విమానం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో కూలిపోయింది. ఆ యుద్ధ విమానాన్ని వింగ్ కమాండర్ బోకిల్, అతని సెకండ్ ఇన్ కమాండ్ బిశ్వాస్ నడుపుతుండగా, నిఫాద్ తహసీల్‌లోని శిరస్గావ్ గ్రామంలోని ఒక పొలంలో అది కూలిపోయింది. పైలట్లు ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. స్వల్ప గాయాలపాలైన వారిని HAL ఆసుపత్రికి తరలించారు.
PIB ఫ్యాక్ట్ చెక్ బృందం కూడా వైరల్ వీడియోలో ఎలాంటి నిజం లేదని తోసిపుచ్చింది. "కశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (LoC) వెంబడి భారత రాఫెల్ యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ కూల్చివేసిందని అనేక పాకిస్తాన్ అనుకూల సోషల్ మీడియా ఖాతాలు తప్పుగా పేర్కొంటున్నాయి. పాకిస్తాన్ సైన్యం ఏ భారతీయ యుద్ధ విమానాన్ని కూల్చలేదు. షేర్ చేసిన వీడియో జూన్ 2024లో మహారాష్ట్రలో కూలిపోయిన సుఖోయ్-30MKI యుద్ధ విమానానికి సంబంధించినది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం అవుతున్న వాదనలను షేర్ చేసేటప్పుడు వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు." అంటూ పోస్టులు పెట్టారు.
విమాన ప్రమాదానికి సంబంధించిన వైరల్ వీడియో 2024 నాటిది, పాకిస్తాన్ సైన్యం నియంత్రణ రేఖ వెంబడి భారత రాఫెల్ ఫైటర్ జెట్‌ను కూల్చివేసిందనే వాదనలో ఎలాంటి నిజం లేదు. మహారాష్ట్రలోని నాసిక్‌లో సుఖోయ్ ఫైటర్ జెట్ విమానం కూలిపోయిన ఘటనకు సంబంధించింది.