ఫ్యాక్ట్ చెక్: సింధ్ నదిలో పడిపోయింది ఖాళీ బస్సు, పారామిలిటరీ దళాలు లేవు
జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ శివార్లలోని హర్వాన్‌లోని దచిగామ్ జాతీయ ఉద్యానవనం సమీపంలోని లిద్వాస్ ప్రాంతంలో సోమవారం,
Paramilitary forces
జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ శివార్లలోని హర్వాన్‌లోని దచిగామ్ జాతీయ ఉద్యానవనం సమీపంలోని లిద్వాస్ ప్రాంతంలో సోమవారం, జూలై 28, 2025న భద్రతా దళాలతో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. ముల్నార్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై కీలకమైన నిఘా వర్గాల సమాచారం ఆధారంగా భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) "ఆపరేషన్ మహాదేవ్" అనే కోడ్‌నేమ్‌తో ఉమ్మడి ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ఎన్‌కౌంటర్ తీవ్ర కాల్పులకు దారితీసింది, దీని తరువాత భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను అంతం చేసినట్లుగా నిర్ధారించాయి. ఈ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి.
ఇంతలో, నదిలో మునిగిపోతున్న బస్సు చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, బస్సు గందర్బల్ వద్ద సింధా నదిలో పడిపోయినప్పుడు అనేక మంది భారతీయ పారామిలిటరీ సైనికులు గాయపడి మరణించారనే వాదనతో షేర్ చేస్తున్నారు.
"భారత పారామిలిటరీ దళాలను తీసుకెళ్తున్న బస్సు గందర్బల్ వద్ద సింధ్ నదిలో పడటంతో పలువురు భారతీయ సైనికులు మరణించారు " అని ఆ పోస్టుల్లో ఉంది.
వైరల్ పోస్టు ఆర్కైవ్ లింక్ ను చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. ఈ సంఘటనలో సైనికులెవరూ మరణించలేదు లేదా గాయపడలేదు. బస్సు ఖాళీగా ఉంది. ITBP సిబ్బందిని తీసుకెళ్లడానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి మేము చిత్రాన్ని శోధించినప్పుడు, బస్సు నదిలో పడిపోయిన వీడియోను పంచుకునే సంఘటన గురించి అనేక మీడియా కథనాలు మాకు కనిపించాయి.
నదిలో మునిగిపోతున్న బస్సు వీడియోను ANI షేర్ చేసింది. ఒక ITBP బస్సు దళాలను తీసుకెళ్లడానికి వెళుతుండగా నదిలోకి జారిపోయింది. స్వల్ప గాయాలతో బయటపడిన డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. NDRF, SDRF, పోలీసులు బస్సును రక్షిస్తున్నారు. అదృష్టవశాత్తూ, బస్సులో సైనికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపింది.
CNBCTV18.com ప్రచురించిన నివేదిక ప్రకారం, ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు సిబ్బందిని తీసుకెళ్లేందుకు జూలై 30, 2025న జమ్మూ కశ్మీర్‌లోని గందర్‌బల్‌లోని సింధ్ నదిలో ఒక ఖాళీ బస్సు పడిపోయింది. "ఐటీబీపీ బస్సు సైనికులను తీసుకెళ్లేందుకు వెళుతుండగా. బస్సు నదిలోకి జారిపోయింది. డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. బస్సులో సైనికులు లేరు" అని గందర్‌బల్ SSP ఖలీల్ అహ్మద్ పోస్వాల్ చెప్పారు.
గ్రేటర్ కశ్మీర్ ప్రచురించిన యూట్యూబ్ వీడియోలో, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులను తీసుకెళ్లడానికి వెళ్తున్న బస్సు సింధ్ నదిలోకి జారిపడిందని, డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడని, ప్రమాదంలో మరే ఇతర నష్టం జరగలేదని ఎస్ఎస్పి పేర్కొన్నట్లు చూపిస్తుంది.
రైసింగ్ కశ్మీర్ లో ప్రచురించిన కధనం ప్రకారం, జూలై 30, 2025 ఉదయం, గందర్బల్ జిల్లాలోని జిర్పోరా కుల్లన్ వంతెన సమీపంలో ఒక బస్సు ప్రమాదానికి గురై నల్లా సింధ్‌లోకి దూసుకెళ్లింది. సైనికులను తీసుకెళ్లడానికి ఉద్దేశించిన ఖాళీ వాహనం, రెసిన్ కుల్లన్ వద్ద వంపు వద్ద నదిలోకి జారిపోయింది.
ఈ ప్రమాదంలో బండిపోరాలోని గనస్తాన్ సుంబాల్ నివాసి, అలీ మొహమ్మద్ దార్ కుమారుడు వసీం అహ్మద్ దార్ అనే డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అతన్ని వెంటనే కుల్లన్ పిహెచ్‌సికి తరలించారు, అతని పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. సంఘటన తర్వాత, ఎస్‌ఎస్‌పి గందర్బల్ ఖలీల్ అహ్మద్ పోస్వాల్, ఎస్‌హెచ్‌ఓ గుండ్, ఇతర సీనియర్ భద్రతా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఎస్‌పి పోస్వాల్ మాట్లాడుతూ తెల్లవారుజామున ప్రమాదం జరిగిందని, బస్సులో భద్రతా దళాలు లేవని ధృవీకరించారు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని, కోలుకుంటున్నారని ఆయన అన్నారు. నల్లా సింధ్ నది జలాల నుండి వాహనాన్ని వెలికితీసేందుకు NDRF, SDRF, J&K పోలీసులు, భారత సైన్యం, ITBP, ఇతర సంబంధిత సంస్థల బృందాలు సంయుక్తంగా సహాయక చర్యలను ప్రారంభించాయి.
కాబట్టి, బస్సు ప్రమాదంలో భారత సైనికులు గాయపడి మరణించారనే వాదన నిజం కాదు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో సైనికులెవరూ లేరు.
Claim : గందర్బల్ వద్ద సింధ్ నదిలో భారత పారామిలిటరీ దళాలను తీసుకెళ్తున్న బస్సు పడిపోవడంతో అనేక మంది భారతీయ సైనికులు మరణించారు, గాయపడ్డారు
Claimed By : Twitter users
Fact Check : Unknown