ఫ్యాక్ట్ చెక్: బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మద్దతు తెలపలేదు

బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను ఇటీవలి కాలంలో కలిసి

Update: 2025-10-19 05:59 GMT

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి వి.నవీన్ యాదవ్ శుక్రవారం తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. యూసుఫ్‌గూడ చెక్ పోస్ట్ నుండి భారీ ఊరేగింపుతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది, శ్రీనగర్ కాలనీ మీదుగా షేక్‌పేట తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుంది. అక్కడ, యాదవ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి. సాయిరాం ముందు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. సీనియర్ నాయకుడు వి.హనుమంత రావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కాంగ్రెస్ నాయకురాలు హబీబా సుల్తానా వంటి ప్రముఖులు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.

తన చేతిలో రూ.6 లక్షల నగదు, ఏడు క్రిమినల్‌ కేసులతో పాటు రూ.35 కోట్ల విలువైన స్థిరాస్థులున్నాయని జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన నవీన్‌ యాదవ్‌ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన చేతిలో రూ.4లక్షల నగదు, భార్య వర్షాయాదవ్‌ చేతిలో రూ.2లక్షల నగదు ఉందని, ఐదు బ్యాంక్‌ అకౌంట్లలో కలిపి రూ.37.6 లక్షల నిల్వ, తన భార్య వర్షాయాదవ్‌కు చెందిన రెండు అకౌంట్లలో రూ.10వేలు ఉందన్నారు.
అయితే బీఆర్ఎస్ నేతలు నవీన్ యాదవ్ కు మద్దతు ఇస్తున్నట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. "మా బీసీ బిడ్డను మేము గెలిపించుకుంటామంటున్న బిఆర్ఎస్ లోని బీసీ నేతలు..🔥🔥 నవీనన్న గెలుపు జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు" అంటూ పలువురు పోస్టులు పెట్టారు.


Full View




Full View


వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు




 ఫ్యాక్ట్ చెకింగ్:


వైరల్ అవుతున్న వాదనలో నిజం లేదు. ఈ విజువల్స్ ఇటీవలివి కావు. 2022 లోనే ఈ వీడియో వైరల్ అయింది.

బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను ఇటీవలి కాలంలో కలిసి ఉంటే తప్పకుండా అది వార్తల్లో నిలిచి ఉండేది. కానీ అలాంటిది ఏదైనా జరిగిందేమో అని తెలుసుకోడానికి ప్రయత్నించగా మాకు ఎలాంటి మీడియా కథనాలు లభించలేదు.

ఇక వైరల్ అవుతున్న వీడియో లోని స్క్రీన్ షాట్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం.

వైరల్ అవుతున్న అదే వీడియోను Minister Srinivas Goud Garu Navin Yadav Garu Jubilee Hills అనే టైటిల్ తో D9 MEDIA ఛానల్ లో వీడియోను అప్లోడ్ చేశారు.


Full View

మేము నవీన్ యాదవ్ సోషల్ మీడియాను పరిశీలించగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి క్రీడలకు, త్రోబాల్‌ను ప్రోత్సహించినందుకు నవీన్ యాదవ్ చేసిన సేవను క్రీడా మంత్రి ప్రశంసించారని పోస్టు పెట్టారు. SATS నుండి ఎటువంటి గ్రాంట్ లేకుండా ఆయన ప్రతి జాతీయ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తున్నారని, అన్ని వయసుల ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తున్నారని ఆ పోస్టులో పెట్టారు.

@vnaveenyadav @vsrinivas_goud Sports minister applauded our dynamic leader Naveen Yadav Garu for his service towards sports and encouraging Throwball since formation of Telangana State . With out any grant from SATS he is conducting every one National Championship and conducting All age groups Inter District championship , . Proud of our leader అంటూ మే 10, 2022న నవీన్ యాదవ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను పోస్టు చేశారు.


Full View

వైరల్ అవుతున్న విజువల్స్ లోనూ, 2022 నాటి వీడియో లోని లొకేషన్స్ రెండూ ఒకే విధంగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.

కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. మే 10, 2022న జరిగిన ఘటనకు సంబంధించిన విజువల్స్ ను ఇటీవలివిగా షేర్ చేశారు.


Claim :  బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బహిరంగంగా మద్దతు
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News