హైదరాబాద్‌లో జరిగిన జాతీయ సమావేశంలో బీజేపీ మద్యం పంపిణీ చేసిందంటూ పాత వీడియోను షేర్ చేస్తున్నారు

హైదరాబాద్‌లో జరిగిన రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత కొందరు వ్యక్తులు మద్యం పంచుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా షేర్ అవుతోంది. వీడియోలోని వ్యక్తులు బీజేపీ కండువాలు, టోపీలు ధరించి ఉండడం చూడొచ్చు.

Update: 2022-07-06 12:00 GMT

హైదరాబాద్‌లో జరిగిన రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత కొందరు వ్యక్తులు మద్యం పంచుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా షేర్ అవుతోంది. వీడియోలోని వ్యక్తులు బీజేపీ కండువాలు, టోపీలు ధరించి ఉండడం చూడొచ్చు.

ఈ సమావేశానికి ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖ నేతలు హాజరుకావడంతో అందరినీ ఆకర్షించింది. సమావేశానికి హాజరైన వేలాది మందిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.

హిందీ క్యాప్షన్ తో ఆ వీడియో షేర్ చేయబడుతోంది "वाह मोगली जी, आपकी पार्टी ने तो तेलंगाना को भी गोवा बना दिया! क्या ऐश है...!!" అనువదించినప్పుడు "వావ్ మోగ్లీ జీ, మీ పార్టీ తెలంగాణను కూడా గోవాగా మార్చింది! ఏమిటి సంగతులు...!!"

Full View


Full View
Full View

ఈ దావాను పబ్లిక్ ఇంట్రెస్ట్ లాయర్,యాక్టివిస్ట్ ప్రశాంత్ భూషణ్ కూడా పంచుకున్నారు.

నిజ నిర్ధారణ:

హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ సమావేశంలో ఆ వీడియో చిత్రీకరించారనే వాదన అవాస్తవం. 2021కి చెందిన పాత వీడియో రీసెంట్‌గా తీసింది అంటూ షేర్ చేయబడుతోంది.

వీడియో నుండి తీసుకున్న కీఫ్రేమ్‌లను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను ఉపయోగించి వెతికగా, అనేక ఫలితాలు లభించాయి.

2021 డిసెంబర్‌లో టెన్ న్యూస్ ప్రచురించిన యూట్యూబ్ వీడియో లభించింది, దాని టైటిల్ 'హరిద్వార్‌లో జెపి నడ్డా ర్యాలీకి జనాలను ఆకర్షించడానికి బిజెపి మద్యం సేవించింది, యూత్ కాంగ్రెస్ ఆరోపించింది'.

Full View

దైనిక్ భాస్కర్‌లో ప్రచురించబడిన కథనంలో కూడా అదే వీడియోను చూపిస్తూ యుపి కాంగ్రెస్ వీడియోను 'బిజెపి పరిస్థితి దారుణంగా ఉంది, జనాలను సమీకరించడానికి మద్యం పంపిణీ చేస్తున్నారూ అంటూ షేర్ చేసారంటూ రాసింది. ఈ వీడియో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో బిజెపి నాయకుడు జెపి నడ్డా కార్యక్రమానికి ముందు తీసింది అంటూ పంచుకున్నారు. అయితే, అది నిర్ధారణ కాలేదు.

డిసెంబర్ 2021 లో యూపీ కాంగ్రెస్ చేసిన ట్వీట్, షేర్ చేసిన వైరల్ వీడియో

అందుకని, ఈ వైరల్ వీడియో గత వారం హైదరాబాద్ లో జరిగిన బిజేపి మీటింగ్ కి సంబంధించింది కాదు, 2021 లో తీసిన పాతా వీడియో ను తీసుకొని తప్పుడు కధనం తో పంచుకుంటున్నారు.

Claim :  BJP distributed alcohol in recent national meeting held at Hyderabad
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News