జాగ్రత్త, మీషో పేరుతో 12.5 లక్షల రూపాయలను లాటరీ లేఖ నిజం కాదు, ఒక స్కామ్

ఆకర్షణీయమైన ఆఫర్‌లను నిరోధించడం కష్టం, అమాయక వ్యక్తులను వారి వ్యక్తిగత వివరాలను పంచుకునేట్టుగా చేసేందుకు స్కామ్‌స్టర్‌లు ఎన్నో ఉపాయాలు చేస్తుంటారు.

Update: 2022-07-20 06:48 GMT

ఆకర్షణీయమైన ఆఫర్‌లను నిరోధించడం కష్టం, అమాయక వ్యక్తులను వారి వ్యక్తిగత వివరాలను పంచుకునేట్టుగా చేసేందుకు స్కామ్‌స్టర్‌లు ఎన్నో ఉపాయాలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో షేర్ చేసే మోసపూరిత లింక్‌ల ద్వారా, లాటరీని గెలుచుకున్నారంటూ డబ్బు పొందడానికి వివరాలను నింపాలంటూ లేఖల ద్వారా జరుగుతూ ఉంటుంది.

భారతదేశంలో ఆన్‌లైన్ ఫ్యాషన్ స్టార్టప్ -మీషో పేరుతో స్క్రాచ్ కార్డ్‌తో పాటు ఆఫర్ లెటర్ ఒకటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేయబడుతోంది. స్క్రాచ్ కార్డ్‌లో లాటరీ మొత్తం 12.5 లక్షల రూపాయలుగా చూపబడింది.

ఆ లేఖలో 'మీషో ఆన్‌లైన్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్' తన పుట్టినరోజు వేడుకను జరుపుకుంటోంది, కంపెనీ లక్కీ డ్రా కాంటెస్ట్‌లో కొంతమంది కస్టమర్లను ఎంపిక చేసింది. టోల్ ఫ్రీ నంబర్ 745006281కు కాల్ చేయడం ద్వారా లేదా 7450056281కు శంశ్ పంపడం లేదా కూపన్ కోడ్‌ను వాట్సాప్ చేయడం ద్వారా లేదా www.meeshogift.com

వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా కూపన్‌ను రీడీమ్ చేసుకోవచ్చని లేఖలో పేర్కొన్నారు.

బ్యాంక్ ఖాతా నంబర్, ఖాతాదారు పేరు, పాన్ కార్డ్ వివరాలు, ఆధార్ నంబర్ వంటి వివరాలను పూరించాలని కోరారు. HSBC బ్యాంకు బ్యాంకింగ్ భాగస్వామిగా పేర్కొనబడింది.

Full View


నిజ నిర్ధారణ:

లేఖ మోసం మరియు లాటరీ క్లెయిం అబద్దం.

లేఖలో షేర్ చేసిన ఫోన్ నంబర్‌ను ట్రూకాలర్ వంటి యాప్‌లను ఉపయోగించి శోధించినప్పుడు, ఆ నంబర్ స్పామ్‌ జాబితా చేయబడిందని తెలుస్తోంది. లేఖలో పేర్కొన్న వెబ్‌సైట్ – www.meeshogift.com పని చేయడం లేదు.

"మీషో లాటరీ" అనే కీలక పదాలతో శోధించినప్పుడు, సర్క్యులేషన్‌ లో ఉన్న "మీషోస్కామ్" గురించి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఎంతోమంది వినియోగదారులు ఉన్నట్లు తెలుస్తోంది.


అనేక ట్విట్టర్ హ్యాండిల్స్ వ్యాఖ్యల విభాగంలో, వినియోగదారుల ప్రశ్నలకు మీషో అధికారిక ట్విట్టర్ ఇలా వచ్చిన లేఖ మోసపూరితమైనది అని ప్రకటించింది.



Full View

మీషో పేరుతో జరుగుతున్న మోసాలపై, మీషో తన వినియోగదారులను హెచ్చరించింది. ఇది "జాగ్రత్త! ఇది మాది కాదు, స్కాంస్టర్. మీషో పేరును వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడంతోపాటు కస్టమర్లను మోసం చేయడానికి, తప్పుదోవ పట్టించడానికి దుర్వినియోగం జరుగుతోందని గమనించాము.

అటువంటి మోసాలు, ఫిషింగ్ కార్యకలాపాల పట్ల జాగ్రత్త వహించండి, ఈ దశలను అనుసరించడం ద్వారా మీరు అటువంటి స్కామ్‌స్టర్‌లను గుర్తించి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు:

అ. అప్రమత్తంగా ఉండండి. దయచేసి OTP, UPI/ATM PIN, CVV లేదా క్రెడిట్/డెబిట్ కార్డ్ వివరాల వంటి బ్యాంక్ వివరాలతో సహా మీషో ప్రతినిధిగా క్లెయిమ్ చేసుకునే ఎవరికైనా వ్యక్తిగత లేదా సున్నితమైన డేటాను బహిర్గతం చేయవద్దు.

బి. మీరు ఏవైనా అనుమానాస్పద లింక్‌లు లేదా ఏదైనా అనధికార వెబ్ పోర్టల్‌లు లేదా సోషల్ మీడియా పోస్ట్‌లపై క్లిక్ చేయలేదని నిర్ధారించుకోండి.

సి. ఏదైనా అనుమానాస్పద కాల్‌లు, నకిలీ సందేశాలు, అయాచిత లేదా స్పామ్ ఇ-మెయిల్‌లు, ఏదైనా వ్యక్తిగత సమాచారాన్ని వాపసు క్లెయిమ్‌లను ప్రాసెస్ చేసే నెపంతో తప్పుగా షేర్ చేయమని అనధికారిక వ్యక్తి(లు) మీకు పంపిన ఏదైనా కమ్యూనికేషన్ కోసం చూడండి. అనధికారిక ఆఫర్‌లు, లాటరీలు, పోటీలు లేదా పథకం లేదా అలాంటి భాగస్వామ్యానికి డబ్బు చెల్లించమని అడగడం లేదా ఏదైనా అవార్డును స్వీకరించడం లేదా ఏదైనా ఉద్యోగ అవకాశాన్ని అందించడం.

డి. మీషో ప్రతినిధి లేదా జాబ్ కన్సల్టెంట్(లు) అని తప్పుగా క్లెయిమ్ చేసుకునే ఏ వ్యక్తికి అయినా డబ్బు చెల్లించడం లేదా డిపాజిట్ చేయడం మానుకోండి. మీషో లేదా దాని ప్రతినిధి లేదా అధీకృత రిక్రూట్‌మెంట్ కన్సల్టెంట్‌లు ఉద్యోగాల కోసం డబ్బు లేదా మరేదైనా చెల్లింపు తీసుకోరు.

ఇ. అటువంటి మోసం లేదా ఫిషింగ్ నుండి సురక్షితంగా ఉండటానికి మీరు నకిలీ లేదా తప్పుదారి పట్టించే ఏదైనా సంఘటనను వెంటనే మాకు నివేదించండి.

ఎఫ్. అటువంటి మోసం లేదా ఫిషింగ్ నుండి మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడానికి మీషో ప్లాట్‌ఫారమ్, ఆమోదించబడిన సోషల్ మీడియా పేజీలతో సహా మీషో అధీకృత ఛానెల్‌లను ఉపయోగించి మాతో లావాదేవీలు జరుపుతున్నారా లేదా అన్నది నిర్ధారించుకోండి.

మాతో మీ ఆన్‌లైన్ లావాదేవీల భద్రత గురించి మేము ఆందోళన చెందుతున్నాము, మీ కోసం సురక్షితమైన వినియోగదారు అనుభవాన్ని ఎల్లప్పుడూ ఉంచడానికి ప్రయత్నిస్తాము. ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి legalsupport@meesho.comని సంప్రదించండి"

https://www.meesho.com/legal/anti-phishing-alert

మీషో ఒక బ్లాగును కూడా విడుదల చేసింది, అందులో ఈ రోజుల్లో జరుగుతున్న లాటరీ మోసాల రకాలను కంపెనీ చర్చిస్తూ స్క్రాచ్ కార్డ్‌లు, లక్కీ డ్రా పోటీలు మరియు ఇతర వివరాలను తెలుపుతుంది.

బహుమతులు, రివార్డ్‌లు లేదా లాటరీల కోసం రుసుము చెల్లించవద్దు, మీ వినియోగదారు ఖాతా లేదా పాస్‌వర్డ్‌ను అప్‌డేట్ చేయమని అడిగే లింక్‌లకు ఎప్పుడూ ప్రతిస్పందించవద్దు, అటువంటి అనుమానాస్పద కార్యాచరణను మీషో యొక్క లీగల్ సపోర్ట్‌కి legalsupport@meesho.com కి నివేదించండి అంటూ మోసాలను నివారించే మార్గాలను కూడా వారు పేర్కొన్నారు

https://meesho.io/blog/lottery-scams-fake-lottery-message-prize-scams-lottery-ticket-scam?utm_source=twitter&utm_medium=organic_social&utm_campaign=image-post

అందువల్ల, ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ మీషో నుండి వచ్చిన లేఖ ఒక మోసం, మరియు స్క్రాచ్ కార్డ్ ద్వారా 12.5 లక్షల రూపాయలను గెలుచుకున్న వినియోగదారుల క్లెయిమ్ అబద్దం. ఇది వినియోగదారుల వ్యక్తిగత వివరాలను సేకరించడానికి మోసగాళ్లు చేసిన క్లిక్‌బైట్ ప్రయత్నం, కాబట్టి అలాంటి లేఖల పట్ల జాగ్రత్త వహించండి.

Claim :  Meesho offering a scratch card 12.5 lakh rupees
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News