ఫ్యాక్ట్ చెక్: భజరంగ్ దళ్ సభ్యులు మసీదుకు నిప్పు పెట్టారనే వాదన నిజం కాదు

పహల్గామ్‌లో ఉగ్రదాడి తర్వాత, భద్రతా కారణాల దృష్ట్యా జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం లోయలోని 50 పర్యాటక ప్రదేశాలు, ట్రెక్కింగ్

Update: 2025-05-02 06:34 GMT

పహల్గామ్‌లో ఉగ్రదాడి తర్వాత, భద్రతా కారణాల దృష్ట్యా జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం లోయలోని 50 పర్యాటక ప్రదేశాలు, ట్రెక్కింగ్ మార్గాలను మూసివేసింది. పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య భారతదేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ విమానయాన సంస్థలు తన గగనతలాన్ని ఉపయోగించకుండా నిషేధించింది. ఈ చర్య పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌ను ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. పలు విమానాలకు సంబంధించి కనెక్టివిటీలో అంతరాయాలు ఏర్పడతాయి. భారత సైనిక అధికారులు ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేసి, దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ప్రశ్నించడానికి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నియంత్రణ రేఖ (LOC) వెంబడి కాల్పుల విరమణ ఉల్లంఘనలకు ఓ వైపు పాకిస్తాన్‌ తూట్లు పొడుస్తూ ఉండగా, భారత్ కూడా గట్టి హెచ్చరికలను పంపింది. ఈ సమస్యను హైలైట్ చేయడానికి అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేస్తూ భారతదేశం దృఢమైన వైఖరిని ప్రదర్శిస్తోంది.

పహల్గాం ఘటన సమయంలో తీవ్రవాదులు మతాన్ని అడిగి పలువురిని చంపారు. అలా భారతీయుల మధ్య అంతరాలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, దేశంలోని పౌరులందరూ ఐక్యంగా నిలిచారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులు, మత, సామాజిక సంస్థలు ఉగ్రవాదుల వేటలో కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతును ప్రకటించాయి. ఇంతలో కొంతమంది దేశంలో మతపరమైన ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నంలో భాగంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. భారతదేశంలోని బజరంగ్ దళ్ సభ్యులు ఒక మసీదును తగలబెట్టారనే వాదనతో కాలిపోతున్న భవనం వీడియోను షేర్ చేస్తున్నారు. అనేక మంది ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఈ వీడియోను “భజరంగ్ దళ్ సభ్యులు మసీదును తగలబెట్టారు” అనే టెక్స్ట్‌తో షేర్ చేశారు.


వైరల్ పోస్టు ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియోలో కాలిపోతున్నట్లు కనిపిస్తున్న నిర్మాణం మసీదు కాదు. ఇది ఘజియాబాద్‌లో ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకున్న ఫంక్షన్ హాల్.
వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు "మౌంట్ గ్రీన్ ఫామ్స్ రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్ ఘజియాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది" అనే శీర్షికతో అదే వీడియోను షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. ఈ వీడియో పహల్గామ్ ఉగ్రవాద దాడి జరగడానికి ముందు ఏప్రిల్ 4, 2025న షేర్ చేశారు.
‘The banquet hall on fire in Raj Nagar Extension on Thursday afternoon. Two vehicles were also gutted in the fire that is believed to have started from a short-circuit.’ అనే క్యాప్షన్ తో ఏప్రిల్ 4న ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ కూడా అదే వీడియోను షేర్ చేశారు.
ఘజియాబాద్‌లోని నందగ్రామ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని రాజ్ నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని ఒక ఫంక్షన్ హాల్‌లో మంటలు చెలరేగాయని జీ న్యూస్ వెబ్‌సైట్ వైరల్ వీడియోను షేర్ చేసింది. మంటల కారణంగా, ఫంక్షన్ హాల్ ప్రధాన ద్వారం పూర్తిగా బూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పింది.
హిందూస్తాన్ టైమ్స్ ప్రకారం, సమీపంలోని చెత్త కుప్పలకు మంటలు అంటుకున్నాయని, ఆ మంటలు రాజ్ బాగ్ మెట్రో స్టేషన్ సమీపంలో ఆపి ఉంచిన ట్రక్కులకు వ్యాపించాయని అనుమానిస్తున్నట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. రాజ్ నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని ఒక ఫామ్‌హౌస్ ముందు భాగం మంటల్లో కాలిపోయింది.
అందువల్ల, వైరల్ వీడియోలో బజరంద్ దళ్ సభ్యులు మసీదుకు నిప్పంటిస్తున్నట్లు చూపించలేదు. వీడియోలో ఘజియాబాద్‌లోని ఒక ఫంక్షన్ హాల్ ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకున్నట్లు చూపిస్తుంది. ఈ సంఘటన ఏప్రిల్ 4, 2025న నివేదించారు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim :  బజరంగ్ దళ్ సభ్యులు ఒక మసీదుకు నిప్పు పెట్టారని వైరల్ వీడియో చూపిస్తుంది
Claimed By :  Instagram Users
Fact Check :  Unknown
Tags:    

Similar News