ఫ్యాక్ట్ చెక్: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటామని అఫ్గాన్ మిలిటెంట్లు ప్రకటించలేదు, పాత వీడియోను షేర్ చేస్తున్నారు
ప్రస్తుతం జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఉగ్రవాదానికి సంబంధించిన అన్ని రూపాలు, వ్యవస్థలను ఎదుర్కోవడానికి నాయకులు
Liberation front of Afghan
ప్రస్తుతం జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఉగ్రవాదానికి సంబంధించిన అన్ని రూపాలు, వ్యవస్థలను ఎదుర్కోవడానికి నాయకులు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. శాంతి, భద్రతపై జరిగిన సమావేశంలో భారత ప్రధాన మంత్రి మోదీ ఉగ్రవాద ముప్పు అంశాన్ని లేవనెత్తారు. పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండించినందుకు, భారతదేశంతో సంఘీభావం వ్యక్తం చేసినందుకు సభ్య దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఏప్రిల్ 2025లో జరిగిన పహల్గామ్ దాడి తర్వాత, తాలిబన్ పాలిత ఆఫ్ఘనిస్తాన్ కూడా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది.
లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ కార్యకర్తలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలోని వ్యక్తులు, వారి ముఖాలను పూర్తిగా ముసుగులతో కప్పి ఉంచుకున్నారు. పహల్గామ్ ఘటనకు ఇంకా ప్రతీకారం తీర్చుకోలేదని, ప్రతి ISI ప్రాయోజిత పోరాట యోధుడిని అంతం చేసే వరకు ఆగమని చెప్పడం వినవచ్చు. ఈ వీడియోను “బ్రేకింగ్” అంటూ షేర్ చేస్తున్నారు. లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అధికారికంగా హెచ్చరించింది. “పహల్గామ్ కు ఇంకా ప్రతీకారం తీర్చుకోలేదు. పాకిస్తాన్ లేదా మరెక్కడైనా ISI కు చెందిన వ్యక్తుల్ని వేటాడి నిర్మూలించే వరకు మేము ఆగము.” అంటూ అందులో చెప్పారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. ఈ వీడియో 2022 నుండి ఆన్ లైన్ లో ఉంది. వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఆ వీడియో 2022 నుండి ఆన్‌లైన్‌లో ఉందని మాకు తెలిసింది.
“یک جبهه نظامي دیگر به نام جبهه ازادی افغانستان شروع به فعالیت ضد ط لبان کرد.” ఫిబ్రవరి 5, 2022న కాబూల్ MAN అనే యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేసిన ఒక వీడియోను మేము కనుగొన్నాము. అనువదించినప్పుడు ‘మరొక సైనిక బృందం, ఆఫ్ఘన్ లిబరేషన్ ఫ్రంట్, తాలిబాన్ వ్యతిరేక కార్యకలాపాలను ప్రారంభించింది.’ అని అర్థం వస్తుంది.
వీడియోలో ఆడియోను ఎడిట్ చేశారని, నిజమైన ఆడియో పూర్తిగా భిన్నంగా ఉందని చెబుతున్న ఒక X వినియోగదారుడి పోస్ట్ మాకు లభించింది. “ఇది నిజమైన ఆడియో. మీరు ఆన్‌లైన్‌లో చదివిన, చూసే ప్రతిదాన్ని నమ్మవద్దు.” అని అందులో తెలిపారు.
మరింత వెతకగా షియా న్యూస్ అసోసియేషన్ అనే వెబ్‌సైట్ ఫిబ్రవరి 3, 2022న అప్లోడ్ చేసిన వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. "ఆఫ్ఘనిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్" అని పిలువబడే మరొక తాలిబాన్ వ్యతిరేక సైనిక ఫ్రంట్ తన ఉనికిని ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని షఫాక్నా న్యూస్ ఏజెన్సీ ప్రకారం, ఈ ఫ్రంట్ ఒక వీడియోలో ఆఫ్ఘనిస్థాన్ దేశంలో మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. వారు తాలిబాన్‌లను ఎదిరించడం గురించి మాట్లాడుతారు.
ఫిబ్రవరి 4, 2022న ఆఫ్ఘనిస్తాన్ ఇంటర్నేషనల్ అనే వెబ్‌సైట్‌లో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం, ఆఫ్ఘన్ ఫ్రీడమ్ ఫ్రంట్ అని పిలువబడే తాలిబన్ వ్యతిరేక సైనిక ఫ్రంట్ తన ఉనికిని ప్రకటించింది. ఒక వీడియోలో, జర్నలిస్టులను అరెస్టు చేయడం తాలిబన్ చర్యలు, నిరసనకారులను విడిపించడం, మహిళల పరిస్థితి వారి తిరుగుబాటుకు కారణాలలో ఒకటి అని ఫ్రంట్ పేర్కొంది. అహ్మద్ మస్సౌద్ నేతృత్వంలోని రెసిస్టెన్స్ ఫ్రంట్‌తో తమకు సంబంధం లేదని ఈ మిలిటరీ ఫ్రంట్ తెలిపింది.
అహ్మద్ మస్సౌద్ నేతృత్వంలోని నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్, రాజకీయ, జిహాదీ వ్యక్తుల బృందంతో కూడిన నేషనల్ రెసిస్టెన్స్ కౌన్సిల్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే తమ ఉనికిని ప్రకటించాయి. రెండింటికీ రాజకీయ, సైనిక విభాగాలు కూడా ఉన్నాయి. అయితే, ఆఫ్ఘన్ ఫ్రీడమ్ ఫ్రంట్‌కు సైనిక విభాగం మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.
Liberation Front AFG ఫేస్ బుక్ పేజీ మాకు కనిపించింది. వైరల్ వీడియోను ఫిబ్రవరి 4, 2022న పోస్టు చేశారు.
కాబట్టి, ఆఫ్ఘన్ లిబరేషన్ ఫ్రంట్ వైరల్ వీడియో పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించినది కాదు. ఆ వీడియో 2022 సంవత్సరం నాటిది.
Claim : పహల్గామ్ ఘటన తర్వాత, మిలిటెంట్ గ్రూప్ ఆఫ్ఘన్ లిబరేషన్ ఫ్రంట్ పాకిస్తాన్‌ను హెచ్చరించింది
Claimed By : Social media users
Fact Check : Unknown