నిజ నిర్ధారణ: నవజాత శిశువుతో అలియా భట్ ఫోటోలు నకిలీవి

కొద్ది రోజుల క్రితం అలియా భట్ ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రకటించిన తర్వాత, నటి నవజాత శిశువుతో ఉన్న ఫోటో ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో వైరల్ అవుతోంది. నవజాత శిశువుతో ఉన్న చిత్రాలను తల్లిదండ్రులిద్దరూ పంచుకోనప్పటికీ, వైరల్ చిత్రాన్ని "అభినందనలు అలియా భట్, ఆడపిల్లతో ఆశీర్వదించబడింది" అనే శీర్షికతో షేర్ చేస్తున్నారు చాలామంది యూజర్లు.

Update: 2022-11-11 14:31 GMT

కొద్ది రోజుల క్రితం అలియా భట్ ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రకటించిన తర్వాత, నటి నవజాత శిశువుతో ఉన్న ఫోటో ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో వైరల్ అవుతోంది. నవజాత శిశువుతో ఉన్న చిత్రాలను తల్లిదండ్రులిద్దరూ పంచుకోనప్పటికీ, వైరల్ చిత్రాన్ని "అభినందనలు అలియా భట్, ఆడపిల్లతో ఆశీర్వదించబడింది" అనే శీర్షికతో షేర్ చేస్తున్నారు చాలామంది యూజర్లు.

Full View


Full View


Full View

అలియా భట్, రణబీర్ కపూర్‌లకు కవలలు పుట్టారని కూడా ఒక వీడియో పేర్కొంది.

Full View

https://www.youtube.com/shorts/tPGt6ATZBKA

నిజ నిర్ధారణ:

క్లెయిం అవాస్తవం. చిత్రం మార్ఫింగ్ అయ్యింది, నవజాత శిశువుతో అలియా భట్ చిత్రం నిజం కాదు.

అలియా భట్, రణబీర్ కపూర్‌ల సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను శోధించినప్పుడు, వారిలో ఎవరూ నవజాత శిశువు చిత్రాన్ని పంచుకోలేదు.

ఇన్‌స్టాగ్రామ్‌లో అలియా భట్ చేసిన ప్రకటన ఇదిగో.

గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి చిత్రాన్ని శోధించినప్పుడు, అసలైన చిత్రం ఇన్స్పేఅలైసెడ్.కాం వెబ్‌సైట్‌లో ప్రచురించబడిన కవల అబ్బాయిలు రియో మరియు సోల్‌ల పుట్టుకను చూపుతున్నట్లుతెలుస్తోంది.

ఇన్‌స్పైరలైజ్డ్ అనేది వెజ్జీ-ఫార్వర్డ్ వంటకాలను పంచుకునే, నిజమైన మాతృత్వ క్షణాలతో కూడిన స్ఫూర్తిదాయకమైన, సరళమైన అలీ మఫుచీ బ్లాగ్. ఈ బ్లాగ్ లో, ఆమె కవల కుమారులకు జన్మనివ్వడంలో జరిగిన ప్రక్రియలు, ఆమె మనోభావాలు వంటి విషయాలను వివరిస్తుంది.

అలీ మఫుచీ తన కుమారులను పట్టుకొని ఉన్న చిత్రాన్ని మార్ఫ్ చేసి అలియా భట్ అంటూ షేర్ చేస్తున్నారు.

అనేక వెబ్‌సైట్‌లు ఈ వాదనను తోసిపుచ్చాయి, చిత్రం మార్ఫింగ్ చేయబడిందని స్పష్టం చేసింది.

అలియా భట్ మరియు రణబీర్ కపూర్‌ల పాప ఇప్పటికే చర్చనీయాంశంగా మారిందని ఇండీయాటివిన్యూస్.కాం పేర్కొంది. ఇద్దరు తమ ఆడబిడ్డ రాకను ప్రకటించినప్పటి నుండి, ఆ చిన్నారితో నటీనటుల నకిలీ ఫోటోలు, వీడియోలతో ఇంటర్నెట్ సందడి చేస్తోంది. చాలా మంది అవి ఆలియా, రణబీర్‌ల పాప ఫోటోలుగా పేర్కొంటున్నారు.

మార్ఫింగ్ చేసిన ఫోటోలలో ఒకదానిలో, ఆలియా తన పక్కనే ఒక బిడ్డతో మంచం మీద విశ్రాంతి తీసుకుంటుంది. ఇంకో ఫోటోలో వారి చేతుల్లో బిడ్డను పట్టుకున్నట్టు కొంత మంది షేర్ చేసారు. ఆసుపత్రిలో పాపతో అలియా ఉన్నట్లు ఓ వీడియో పేర్కొంది.

అయితే, ఈ చిత్రాలన్నీ నకిలీవి. నటీనటులు తమ కుమార్తె ఫోటోలు లేదా వీడియోలను ఇంకా షేర్ చేయలేదని వెబ్‌సైట్ తెలిపింది.

https://www.indiatvnews.com/trending/news/photo-of-alia-bhatt-ranbir-kapoor-baby-revealed-internet-abuzz-with-fake-pics-of-new-parents-bollywood-latest-news-2022-11-08-822196

https://www.bollywoodlife.com/photos/alia-bhatt-ranbir-kapoor-babys-first-picture-out-truth-about-viral-pic-from-the-hospital-bollywood-galleries-2239360/2236448/

అందువల్ల, నవజాత శిశువుతో ఉన్న అలియా భట్ చిత్రం మార్ఫింగ్ చేయబడింది, వాదన అబద్దం.

Claim :  Image shows Alia Bhatt with her newborn child
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News