ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియో కర్ణాటక కి చెందింది అనేది నిజం కాదు, నాగ్ పూర్ కి చెందింది

Viral video claiming 1,500 RSS volunteers held Path Sanchalan in Karnataka is misleading; the footage is from Nagpur, Maharashtra.

Update: 2025-10-29 12:44 GMT

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) 100వ వార్షికోత్సవాన్ని 2025 అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. హిందూ సమ్మేళనాలు నిర్వహించడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మారక స్టాంపు, నాణెం విడుదల చేశారు. అయితే అక్టోబర్ 16న, కర్ణాటక క్యాబినెట్ ప్రభుత్వ ప్రాంగణాల్లో RSS కార్యకలాపాలను పరిమితం చేసే నిబంధనలను ఆమోదించింది, ఇది చట్టపరమైన సవాలుకు దారితీసింది.అయితే అక్టోబర్ 28న హైకోర్టు ఈ ఉత్తర్వును రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ నిలిపివేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ కూడా చేస్తుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటన చేశారు.

చిత్తాపూర్ అధికారులు RSS రూట్ మార్చ్‌కు అనుమతి నిరాకరించడం, శాంతి చర్చలు విఫలమైన తర్వాత ఉద్రిక్తతలు కూడా పెరిగాయి. నవంబర్ 2న తిరిగి షెడ్యూల్ చేయబడిన మార్చ్‌కు RSS చేసిన విజ్ఞప్తిని సమీక్షించాలని కలబురగి బెంచ్ ప్రకటన చేసింది. RSS మార్చ్‌లో చేరినందుకు ఒక ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేశారు. పాఠశాల మైదానాలను ప్రైవేట్‌గా ఉపయోగించడాన్ని నిషేధించే 2013 ఉత్తర్వును రాష్ట్రం తిరిగి జారీ చేసింది. అయితే RSSపై ఎటువంటి నిషేధం విధించబడలేదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
కర్ణాటకలో "నిషేధం ఉన్నప్పటికీ" ఆర్ఎస్ఎస్ బృందం కవాతు నిర్వహించిందని చెబుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనుమతి నిరాకరించినప్పటికీ కర్ణాటక రాష్ట్రం సేడం(సేరం) లో 1500 మంది ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు కవాతు నిర్వహించారని వైరల్ వీడియోలో ఉంది. అనేక మంది వాలంటీర్లు చేసిన రూట్ మార్చ్‌ను ఈ వీడియో చూపిస్తుంది.

వైరల్ అవుతున్న వాదన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. ఆ వీడియో కర్ణాటకకు చెందినది కాదు, నాగ్‌పూర్‌కు చెందినది.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, జై మహారాష్ట్ర న్యూస్ అనే ఛానెల్ ప్రచురించిన యూట్యూబ్ వీడియో కనిపించింది, ఆ వీడియో నాగ్‌పూర్‌కు చెందినదని పేర్కొంది. “Nagpur | RSS | नागपुरात राष्ट्रीय स्वयंसेवक संघाने केलं संचालन | Marathi News” అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారు. వీడియో వివరణలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నాగ్‌పూర్‌లో కవాతు నిర్వహించిందని పేర్కొంది. ఈ కవాతు నగర ప్రధాన కూడలి నుండి సాగింది. ఈ సందర్భంగా విద్యార్థులు వికాస్ వర్గలో పాల్గొన్నారు. 25 రోజుల శిక్షణా శిబిరంలో 840 మంది వాలంటీర్లు పాల్గొన్నారు.
#Nagpur #RSS #Sanchalan #VolunteerTraining #Shiksharthi #25DayCamp #SelflessService#JaiMaharashtraNews #JayMaharashtraNews #MarathiNews అనే హ్యాష్ ట్యాగ్స్ ను మనం చూడొచ్చు.
Full View
“#WATCH | Maharashtra: The Rashtriya Swayamsevak Sangh (RSS) held a ‘Path Sanchalan’ (route march) in Nagpur, showcasing disciplined formations and uniformed participation. (RSS, Nagpur, Maharashtra)” అనే క్యాప్షన్ తో ఇండియా టుడే ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన వీడియోను కూడా మేము కనుగొన్నాము.
Full View
“Spectacular Path Sanchalan by 840 trainees from across Bharat at the 25-day RSS Cadre Training Camp — Karyakarta Vikas Varg - Dwiteeya (Samanya) held in Nagpur.” అంటూ "ఫ్రెండ్స్ ఆఫ్ RSS" అనే X పేజీలో ప్రచురించబడిన కొన్ని చిత్రాలను కూడా లభించింది. ఈ చిత్రాలు మే 26, 2025న ఈ ఖాతాలో షేర్ చేశారు.
వీడియోలోని వాటర్‌మార్క్ ‘NAI’ గురించి మరింత పరిశోధన చేయగా, న్యూస్ అరీనా ఇండియా (NAI) ప్రచురించిన వీడియో మాకు కనిపించింది. NAI అదే వీడియోను మే 25, 2025న ‘మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో RSS సభ్యులు ‘పథ్ సంచాలన్’ నిర్వహించారు’ అనే శీర్షికతో ప్రచురించింది.
కనుక, RSS వాలంటీర్లు కవాతు చేస్తూ పథ్ సంచాలన్ నిర్వహిస్తున్నట్లు చూపించే వీడియో కర్ణాటక లో చోటు చేసుకున్నది కాదు. నాగ్‌పూర్ లో జరిగింది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
Claim :  కర్ణాటకలో అనుమతి నిరాకరించినప్పటికీ 1,500 మంది RSS వాలంటీర్లు పథ్ సంచలన్ నిర్వహించినట్లుగా వైరల్ వీడియో చూపిస్తోంది
Claimed By :  Twitter users
Fact Check :  Unknown
Tags:    

Similar News