Tirumala : నేడు తిరుమలకు వెళ్లేవారికి అలెర్ట్.. దర్శనం కోసం?

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది

Update: 2026-02-24 03:20 GMT

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. నేడు మంగళవారమయినప్పటికీ తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలోనే వచ్చారు. ఎక్కువ కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. గంటల సమయం దర్శనం కోసం ఉండాల్సి వస్తుంది. పరీక్షలు ప్రారంభమయినప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ తగ్గలేదని, శ్రీవారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

వార్షిక బ్రహ్మోత్సవాలకు...
ఫిబ్రవరి 28 నుండి మార్చి నాలుగో తేదీ వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉంటుంది. మార్చి 01న ధ్వజారోహణం ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాలకు ట్రైల్ రన్ ను నిర్వహించారు. తెప్పల సామర్థ్యాన్ని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరీక్షించారు.26వ తేదీన నుంచి ఐదు రోజుల పాటు పుష్కరిణిలో తెప్పోత్సవాలు జరుగుతాయని అధికారులు తెలిపారు.
శ్రీవారి హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 77,803 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 27,766 మంది తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.66 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News