Tirumala : తిరుమలకు పోటెత్తిన భక్తులు .. ఈరోజు దర్శనం కావాలంటే?

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కొనసాగుతుంది

Update: 2026-02-15 03:29 GMT

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కొనసాగుతుంది. ఆదివారం కావడంతో పాటు శివరాత్రి కూడా కలసి రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. తిరుమలకు భారీగా తరలి వస్తున్న భక్తులతో తిరుమల కొండ కిటకిట లాడుతుంది. భక్తులు గోవింద నామస్మరణలతో మాడ వీధులు మారుమోగిపోతున్నాయి. అలిపిరి నుంచి వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంది. వాహనాల తనిఖీకే అలిపిరి టోల్ గేట్ వద్ద ఎక్కువ సమయం పడుతుంది. శివరాత్రి నాడు అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారని భావించి ముందుగానే అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

సెలవులు.. పండగలు వస్తే...
ఏ మాత్రం సెలవులు వచ్చినా సరే తిరుమల భక్తులతో కిటికటలాడిపోతుంది. వైకుంఠనిలయంలో దేవదేవుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటే తమ కష్టాలు, సమస్యలు తొలగిపోతాయని భక్తులు భావిస్తారు. ఇక పండగలకు చెప్పాల్సిన పనిలేదు. పర్వదినాల రోజున భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలి వస్తున్నారు కనుకనే శ్రీవారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. కానీ గతంలో కంటే ఇటీవల కాలంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య బాగా పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
అన్ని కంపార్ట్ మెంట్లు నిండి...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట ఏటీజీఎస్ వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 82,337 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,825 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం3.58 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News