Tirumala : తిరుమలలో హెవీ రష్... దర్శనం సమయం ఎంతో తెలిస్తే?

తిరుమలలో భక్తుల రద్దీ నేడు ఎక్కువగా ఉంది

Update: 2026-02-22 03:39 GMT

తిరుమలలో భక్తుల రద్దీ నేడు ఎక్కువగా ఉంది. ఆదివారం కావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. దర్శనానికి గంటల సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. క్యూ లైన్ లో ఉన్న భక్తులు ఇబ్బందులు పడకుండా శ్రీవారి సేవకులు మజ్జిగ, పాలు, మంచినీరు, అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. క్యూ లైన్లలో చిన్న పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్చలు తీసుకుంటున్నారు.

శ్రీవారి సేవకుల ద్వారా...
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా తరచూ ఉంటుంది. అందులో ఇక శుక్రవారం నుంచి సోమవారం వరకూ భక్తుల రద్దీ కొనసాగుతుంది. తర్వాత కొంత తగ్గినట్లు కనిపించినప్పటికీ శ్రీవారి హుండీ ఆదాయం మాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది అత్యధికంగా జనవరి నెలలో హుండీ ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. అన్న ప్రసాదం, లడ్డూ కేంద్రాల వద్ద కూడా భక్తుల కిటకిట లాడుతుండటంతో ఎక్కువ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
అన్ని కంపార్ట్ మెంట్లు నిండి ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బటయ క్యూ లైన్ లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. భక్తుల క్యూ లైన్ కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ విస్తరించింది. దాదాపు రెండు కిలోమీటర్ల బయటకు క్యూ లైన్ ఉంది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదహారు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటల సమయమ పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఉన్న భక్తులకు దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 82,043 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 32,299 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.74 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News