Tirumala : పదిన్నర గంటల పాటు తిరుమల ఆలయం మూసివేత

మార్చి 3వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు

Update: 2026-02-17 02:41 GMT

మార్చి 3వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. చంద్రగ్రహణం నేపథ్యంలో మార్చి 3వ తేదీన ఉదయం 9 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు. ఆ రోజున మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 వరకు గ్రహణం ఉండనుందని చెప్పారు.

మార్చి 3వ తేదీన...
తిరుమల శ్రీవారి ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా దాదాపు 10.30 గంటలపాటు ఆలయాన్ని మూసివేయనున్నట్లు తెలిపారు. అదేరోజు కుమారధార తీర్థ ముక్కోటి ఉత్సవాలు జరుగుతాయని, వాటికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు ఈ విషయం తెలుసుకుని తిరుమలకు వచ్చేందుకు ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.


Tags:    

Similar News