Tirumala : నేడు తిరుమల వెళ్లే వారికి గుడ్ న్యూస్.. నేరుగా దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ నేడు తగ్గింది
తిరుమలలో భక్తుల రద్దీ నేడు తగ్గింది. భక్తులు పెద్ద సంఖ్యలో లేరు. బుధవారం కావడంతో పాటు ఇక పరీక్షలు మొదలు అవుతుండటంతో తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా తగ్గింది. తిరుమలలో అతి తక్కువ కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అయితే తిరిగి శుక్రవారం నుంచి భక్తుల రద్దీ మొదలవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య సాయంత్రానికి పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఉదయం వేళలో కొంత రద్దీ తక్కువగానే ఉంటుందని తెలిపారు.
నానాటికీ పెరుగుతున్న ఆదాయం...
తిరుమలకు వచ్చే వారి సంఖ్య ఎప్పటికీ తగ్గదు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం కూడా రోజుకు నాలుగు కోట్ల రూపాయలు వరకూ వస్తుంది. మామూలు రోజుల్లోనే ఇంత ఆదాయం. ఇక బంగారు కానుకలు, వెండి వస్తువులు వంటివి కూడా తమ మొక్కులను అనుసరించి భక్తులు స్వామి వారికి సమర్పించుకుంటారు. మరొకవైపు తలనీలాల ద్వారా కూడా కోట్ల రూపాయల్లో ఆదాయం లభిస్తుంది. అందుకే తిరుమలకు వచ్చే భక్తులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
నాలుగు కంపార్ట్ మెంట్లలోనే...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని నాలుగు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 70,509 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 18,058 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.20 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.