డ్రైవర్‌ లెస్‌ కార్లపై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి

డ్రైవర్ లెస్ కార్ల పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రైవర్ రహిత కార్లను ఇండియాలోకి..

Update: 2023-12-21 04:47 GMT

 Will not allow driverless cars in India

డ్రైవర్ లెస్ కార్ల పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రైవర్ రహిత కార్లను ఇండియాలోకి అనుమతించబోమని స్పష్టం చేశారరు. రోడ్డు భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, ఐఐఎం నాగ్‌పూర్‌లో నిర్వహించిన ‘జీరో మైల్ సంవాద్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఎన్నో చర్యలు చేపడుతున్నామన్నారు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను ఇన్‌స్టాల్ చేయడం, రోడ్లపై బ్లాక్ స్పాట్‌లను తగ్గించడం, ఎలక్ట్రిక్ మోటార్స్ చట్టం ద్వారా జరిమానాలను పెంచడం వంటి మార్పులు చేయనున్నట్లు చెప్పారు.

ఎలక్ట్రిక్ మోటార్స్ చట్టం ద్వారా జరిమానాను పెంచామన్నారు. అంబులెన్స్‌లు, క్రేన్‌లను సిద్ధంగా ఉంచారు. దీంతో అంతా సాఫీగా సాగుతుంది. రోడ్డు భద్రతకు సంబంధించి ప్రతి సంవత్సరం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని గడ్కరీ తెలిపారు. అదే సమయంలో డ్రైవర్‌లేని కార్లు భారతదేశంలోని రోడ్లపై ఎప్పటికీ దిగవని గడ్కరీ స్పష్టం చేశారు.

భారతదేశంలో డ్రైవర్ లెస్ కార్లను ప్రవేశపెట్టడాన్ని తాము అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. దీని కారణంగా డ్రైవర్లు ఉద్యోగాలు కోల్పోతారన్నారు. డ్రైవర్‌ లెస్‌ కార్లు భారత్‌కు రావడానికి తాను ఎప్పుడూ అనుతించబోమన్నారు. 


Tags:    

Similar News