Gold Rates Today : బంగారం కొంటున్నారా? అయితే కొంచెం ఆగాల్సిందేనట
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది.
బంగారం ధరలు మరింతగా తగ్గుతున్నాయి. ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం ప్రభావం ఏ మాత్రం పడటం లేదు. గతంలో ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా ఆ ప్రభావం బంగారం, వెండి ధరలపై పడేది. కానీ నేడు యుద్ధం పదమూడు రోజులుగా కొనసాగుతున్నప్పటికీ గత నాలుగు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. పెరగకపోగా, తగ్గుతుండటం ఆనందమే అయినా పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలా మంది తమకు లభించిన అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. బంగారం, వెండి ధరలు మరింత తగ్గే అవకాశముందన్న సంకేతాలు కూడా వినిపిస్తున్నాయంటున్నారు.
మదుపు దారులు కూడా...
బంగారం ధరలు ఎప్పుడూ లేనంతగా పెరగడంతో ధరలను చూసి కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. గతంలో బంగారం, వెండి పై పెట్టుబడి సురక్షితమని భావించేవారు. కానీ నేడు లాటరీలా బంగారం, వెండిపై పెట్టుబడి మారిపోయిందని భావిస్తున్నారు. పెరుగుతుందని మదుపు చేసుకుంటే ధరలు ఒక్కసారిగా తగ్గి నష్టాలకు గురి చేస్తున్నాయని పెట్టుబడి దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక జ్యుయలరీ దుకాణాల యజమానులు కూడా ధరలు ప్రజలకు ముఖ్యంగా మధ్యతరగతి, వేతనజీవులకు అందుబాటులో ఉంటేనే క్రయ విక్రయాలు జోరుగా జరుగుతాయని అంటున్నారు.
డిమాండ్ తగ్గని...
బంగారానికి ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. ధరలు పెరిగినా దానిని కొనుగోలు చేసే వారు ఉంటారు. బంగారాన్ని కొనుగోలు చేస్తే ఎప్పటికైనా ధరలు పెరిగి తమకు భద్రతగా ఉంటుందని భావిస్తారు. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం పై వంద రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,48,690 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,62,210 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,89,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.