Business News : 88 శాతం వృద్ధి సాధించిన వర్స్ ఇన్నోవేషన్‌

దేశీయ భాషల్లో డిజిటల్ కంటెంట్‌ అందించే వర్స్ ఇన్నోవేషన్‌ సంస్థ 2024–25 ఆర్థిక సంవత్సరాన్ని బలమైన వృద్ధితో ముగించింది

Update: 2025-09-30 04:43 GMT

దేశీయ భాషల్లో డిజిటల్ కంటెంట్‌ అందించే వర్స్ ఇన్నోవేషన్‌ సంస్థ 2024–25 ఆర్థిక సంవత్సరాన్ని బలమైన వృద్ధితో ముగించింది. ఆదాయం 88 శాతం పెరిగి 1,930 కోట్ల రూపాయలకు చేరింది. మొత్తం ఆదాయం 64 శాతం పెరిగి 2,071 కోట్ల రూపాయలకు చేరింది. సంస్థ EBITDA బర్న్‌ను ఇరవై శాతాన్ని తగ్గించగలిగింది. ఖర్చుల నియంత్రణ, ఆపరేషన్ల సమర్థతతో లాభదాయక దిశలో అడుగులు వేసింది.

ఆర్థిక ఫలితాలిలా...
2023–24లో ఆపరేషన్ల ఆదాయం 1,029 కోట్ల రూపాయలు కాగా, 2024–25లో అది 1,930 కోట్ల రూపాయలకు పెరిగింది. కొనుగోళ్లు మినహాయిస్తే, వృద్ధి 33 శారతంగా గా నమోదైంది. EBITDA మార్జిన్‌ 89 శాతం నుంచి 38 శాతానికి మెరుగుపడింది. సేవల ఖర్చు ఆదాయంతో పోలిస్తే 112 శాతం నుంచి 77 శాతానికి తగ్గింది. సర్వర్, సాఫ్ట్‌వేర్‌ ఖర్చులు మినహాయిస్తే అది యాభై ఆరు శాతానికి పడిపోయింది. ఇతర ఆపరేటింగ్‌ ఖర్చులు కూడా 77 శాతం నుంచి 61 శతానికి తగ్గాయి.
FY26లో లాభాల లక్ష్యమిదే...
ఈ ఏడాది ద్వితీయార్థంలో గ్రూప్‌ స్థాయిలో బ్రేక్‌ఈవెన్‌ సాధించగలమని సంస్థ అంచనా వేసింది. ఏఐ ఆధారిత ఆటోమేషన్‌, కొత్త సబ్‌స్క్రిప్షన్‌ మోడళ్లు, కంటెంట్‌ క్రియేటర్‌ ప్లాట్‌ఫార్మ్‌లతో ఆదాయం పెంచుకుంటామని తెలిపింది. NexVerse.ai ప్రకటనల ప్రభావాన్ని పెంచుతుందని, Dailyhunt Premium చందాలు వేగంగా పెరుగుతున్నాయని తెలిపింది. జోష్ ఆడియో కాలింగ్‌, వర్స్ కొలాబ్‌ ద్వారా క్రియేటర్లతో అనుసంధానం బలోపేతం అవుతుందని సంస్థ వెల్లడించింది. మ్యాగ్జ్టర్‌, వాల్యూలీఫ్‌ కొనుగోళ్లు వ్యాపార విస్తరణకు దోహదం చేస్తాయని పేర్కొంది. AI ఆధారిత సాంకేతికత, మూలధన బలం వర్స్‌కి డిజిటల్‌ రంగంలో భవిష్యత్‌ వృద్ధిని నడిపిస్తాయని సంస్థ స్పష్టం చేసింది.






Tags:    

Similar News