Gold Price Today : మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు...ఈరోజు ఎంత పెరిగాయో తెలిస్తే?
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అంతే స్థాయిలో పెరిగాయి.
బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఎలా పరుగు పెడుతున్నాయంటే రన్నింగ్ రేసు మాదిరిగా ప్రతి రోజులో రెండు సార్లు ధరలు పెరిగి వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలు దాటేసి నెల రోజులు గడుస్తున్నప్పటికీ దాని నుంచి కిందకు ధరలు దిగి రాకపోవడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత వరసగా, ఈ స్థాయిలో బంగారం, వెండి ధరలు ఎప్పుడూ పెరగలేదని మార్కెట్ నిపుణులు సయితం అంగీకరిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం త్వరలోనే బంగారం ధర లక్షన్నర రూపాయలకు చేరుకునే అవకాశాలు కూడా లేకపోలేదని, అందుకే ధరలు పెరగడంపై ఆందోళన మాని కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి.
అంత శక్తి ఉండొద్దూ...
అయితే ధరలు ఎంత పెరిగినా కొనుగోలు చేయగల శక్తి వినియోగదారులకు ఉండవద్దా? అన్నదే ప్రశ్న. తమవద్ద తగినన్ని డబ్బులుంటేనే బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అప్పులు చేసి ఎవరూ బంగారాన్ని కొనుగోలు చేయరు. అలాగే ఆస్తులు తాకట్టు పెట్టి కూడా బంగారాన్ని కొనుగోలు చేద్దామని ఎవరూ భావించరు. అందుకే ధరలు అందుబాటులో ఉండటాన్ని బట్టి బంగారం కానీ,వెండి ఆభరణాల కొనుగోళ్లు కానీ ఉంటాయన్నది వాస్తవం. కానీ మార్కెట్ నిపుణులు మాత్రం పెట్టుబడి కోసం బంగారం కొనుగోలు చేసే వారు మాత్రం కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. బంగారం ధరలు మరింత పెరగడమే తప్ప తగ్గడం అనేది జరగదని కూడా అంటున్నారు.
మళ్లీ పెరిగి...
ఇక పెళ్లిళ్లు, పండగల సీజన్ నడుస్తున్నప్పటీకి బంగారం కొనుగోళ్లు ఆశించిన రీతిలో జరగడం లేదు. అమ్మకాలు జరగకపోవడంపై జ్యుయలరీ దుకాణాల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నంలో పడ్డారు. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అంతే స్థాయిలో పెరిగాయి. కిలో వెండి ధరపై ఎనిమిది వందల రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,02,390 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,11,700 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర 1,44,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.