Gold Price Today : బంగారం బరువెక్కుతుంది.. వెండి వేడెక్కుతుందిగా
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి
బంగారం ధరలు బరువెక్కిపోతున్నాయి. శరీరంపై బంగారం కనపడాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఒకప్పుడు బంగారం కొనుగోలు చేయాలంటే కాస్తో కూస్తో కొంత సులువుగా ఉండేది.కానీ ఇప్పుడు ఎగువ మధ్యతరగతి కుటుంబాలు, ఉన్నత స్థాయి వర్గాలకు కూడా భారీగా మారింది. భారీగా ఆస్తులుంటే తప్ప బంగారం కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధందగా ధరలు విపరీతంగా పెరగడం వల్లనే బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. బంగారం తో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు వినపడుతున్న నేపథ్యంలో కొనుగోలు చేయాల్సిన వారు ఇప్పుడే కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
కొనుగోలు చేయాలంటే...
బంగారం ధరలు మండిపోతుండటంతో వాటిని కొనుగోలు చేయడానికి భయపడిపోతున్నారు. బంగారం ధర ఒకరోజు తగ్గడం మరొకరోజు పెరగడం మామూలుగా మారింది. అయితే ధరలు పెరిగినప్పుడు భారీగా, తగ్గినప్పుడు స్వల్పంగా మారుతుండటంతో ధరలు అంతగా వినియోగదారులకు అందుబాటులోకి రాలేదన్నది వాస్తవం. ఇక ధరలు తగ్గి అన్ని వర్గాల వారు కొనుగోలు చేసే స్థాయికి మాత్రం దిగి వచ్చే అవకాశం మాత్రం కనిపించడం లేదు. అంతర్జాతీయంగా ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ విధించిన అదనపు సుంకాలు, తీసుకున్న నిర్ణయాలతో ధరలపై ప్రభావం చూపుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
బంగారం స్వల్పంగా...
మరొకవైపు బంగారం అస్సలు కొనుగోలు చేయకుండా ఉండలేరు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన బంగారం, వెండి వస్తువులను శుభకార్యాలకు శుభసూచకంగా కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తుంది. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,17,090 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,17,090 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,80,100 రూపాయలకు చేరుకుంది. మధ్యాహ్నానికి ధరల్లో మరింతగా మార్పులు చోటు చేసుకోవచ్చు.