Gold Rates Today : భారీగా షాకిచ్చిన బంగారం ధరలు.. వెండి ధరలు అంతే
ఈరోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది
బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న హెచ్చరికలు నిజమవుతున్నట్లే కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది చివరలోనూ బంగారం ధర పైపైకి ఎగబాకుతూనే ఉంది. ఏడాది చివర కొంత శాంతిస్తుందని భావించిన వారికి నిరాశ ఎదురవుతుంది. బంగారం విషయంలో వేసుకున్న అంచనాలు అన్నీ తప్పుడుగా మారుతున్నాయి. మార్కెట్ నిపుణులు, బిజినెస్ నిపుణుల అంచనాలకు భిన్నంగా మార్కెట్ నడుస్తుంది. ఎప్పుడూ జరగని విధంగా బంగారం భారంగా మారడంతో కొనుగోళ్లపై దాని ప్రభావం చూపుతుంది. గత రెండు రోజుల వ్యవధిలోనే దాదాపు 2,700 రూపాయల మేరకు పది గ్రాముల బంగారం ధర పెరిగిందంటే ఏ రేంజ్ లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
బంగారంతో పాటు వెండి...
బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా దూసుకుపోతున్నాయి. వెండి ధరలు ఇటీవల కాలంలో కొంత శాంతించినట్లు కనిపించినప్పటికీ మళ్లీ ధరలు ఊపందుకుంటున్నాయి. భారతీయ సంస్కృతిలో బంగారం, వెండి ఆభరణాలు భాగమయ్యాయి. చిన్న శుభకార్యానికి కూడా బంగారం, వెండి కొనుగోలు చేయడం అలవాటు. అలాంటిది ఇప్పుడు పెళ్లిళ్లకు మాత్రమే బంగారం కొనుగోలు చేసే పరిస్థితి నెలకొంది. పుట్టిన రోజు నాడు బహుమతిగా ఇచ్చే బంగారం, వెండి వస్తువులు మాయమై ఇప్పుడు మరొక రూపంలో ఇవ్వడం ప్రారంభమయింది. ఆప్తులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల విషయంలోనూ బంగారం బహుమతిగా ఇవ్వాలంటే భయపడిపోతున్నారు.
నేటి ధరలు...
బంగారం ధరలు ఇంకా ఎంత పెరుగుతాయోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు జరుగుతుండటంతో బంగారం, వెండి విచ్చలవిడిగా కొనుగోలు చేయడం మాత్రం ఆపేశారు. అవసరం మేరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఈరోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,17,920 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,27,920 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,76,00 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరలు మరింత పెరిగే అవకాశముంది.