Gold Rates Today : బ్యాడ్ న్యూస్.. ఇక బంగారాన్ని సొంతం చేసుకోవడం కష్టమేనా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది
బంగారం ధరలు దిగివచ్చినట్లే కనిపించినా మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. ఒకరోజు ధరలు తగ్గాయని సంతోషపడేలోగా మరుసటి రోజు ధరలు భారీగా పెరగడంతో బంగారం ప్రియుల ఆశలు ఆవిరవుతున్నాయి. గత కొన్ని రోజులుగా స్వల్పంగా ధరలు దిగి వస్తున్నాయి. ఇంకా ధరలు తగ్గుతాయేమోనని భావించి కొనుగోలు చేయకుండా చాలా మంది వేచి చూసే ధోరణిని చూశారు. కానీ వేచి చూసే ధోరణి బంగారం, వెండి విషయంలో నమ్మ కూడదని మరొకసారి రుజువయింది. ఇక బంగారం ధరలతో పోటీ పడుతూ వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇక వచ్చే ఏడాది ధరలు ఏ రేంజ్ కు వెళతాయోనన్న ఆందోళన వినియోగదారుల్లో నెలకొంది.
ధరలు పెరగడానికి...
బంగారం ధరలు ఇంతగా పెరగిపోవడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, డాలర్ మరింత బలపడటం, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, ట్రంప్ విధించిన అదనపు సుంకాలు, బంగారం దిగుమతులు కూడా తగ్గడం వంటివి బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపనున్నాయి. ఇప్పటి వరకూ ధరలు పెరిగడంతో కొనుగోళ్లపై ఆ ప్రభావం గట్టిగా పడింది. అమ్మకాలు దారుణంగా నిలిచిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు విపరీతంగా పెరగడంతో బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేసేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
ధరలు పెరిగి...
దీంతో పాటు పెళ్లిళ్లు, శుభకార్యాలున్నప్పటికీ ఇప్పుడు వరకట్నం స్థానంలో బంగారం పెట్టుబడి ఎక్కువయింది. అందుకే ఆ మాత్రం కొనుగోళ్లు అయినా జరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. వెండి కిలో ధరపై వంద రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,16,460 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,27,050 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి దర 1,74,100 రూపాయలకు చేరుకుంది. మధ్యాహ్నానికి బంగారం, వెండి ధరల్లో మార్పులుండవచ్చు.