Gold Price Today : షాకింగ్ న్యూస్.. బంగారం ధరలు వింటే ఆ ఊసే ఎత్తరుగా?
ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగాయి.
బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. డిసెంబరు నెలలో మరింత షాక్ ఇవ్వనున్నాయి. ధరల పెరుగుదల ఒక రేంజ్ లో కొనసాగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం మరింత ప్రియంగా మారనుంది. ఇప్పటికే బంగారం చాలా మందికి అందుబాటులో లేకుండా పోయింది. అదే సమయంలో వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. బంగారం, వెండి వస్తువులు పెరగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, డాలర్ మరింత బలపడటంతో పాటు ట్రంప్ విధించిన అదనపు సుంకాల ప్రభావం కూడా బంగారం, వెండి ధరల పై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
పెళ్లిళ్ల సీజన్ ముగియడంతో...
పెళ్లిళ్ల సీజన్ కూడా ముగిసింది. మరో మూడు నెలలు మూఢమి కొనసాగుతుంది. ఈ మూడు నెలలు ఇక శుభకార్యాలు ఉండవు. మళ్లీ వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి నుంచి మాత్రమే శుభకార్యాల సీజన్ ప్రారంభమవుతుంది. శుభకార్యాలు కూడా జరగకపోవడంతో ఇక బంగారం, వెండి వస్తువుల అమ్మకాలు మరింత తగ్గే అవకాశాలున్నాయని జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం చెబుతుంది. మరొకవైపు ధరల పెరుగుదల ఆగేటట్లు కనిపించడం లేదు. వచ్చే ఏడాది ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరలు తగ్గుతాయని భావించి కొనుగోలు చేయకుండా ఉంటే మాత్రం అది నష్టమేనని చెబుతున్నారు. అయితే మూఢమి సమయంలో కొనుగోలు చేయరు.
నేటి ధరలు ఇలా...
బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేయడానికి ఒక సీజన్ ఉంటుంది. అయితే పెట్టుబడి పెట్టేవారికి సీజన్ అంటూ ఏమీ ఉండదు. అయితే ధరలు మరింత పెరిగే అవకాశముండటంతో ఇక వారు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగాయి. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,18,990 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,29,810 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,91,9000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మరింత మార్పులు జరగవచ్చు.