Gold Price Today : షాకిచ్చిన బంగారం ధరలు.. భారీగా పెరిగిన వెండి ధరలు

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అదేస్థాయిలో పెరగడం విశేషం.

Update: 2025-11-29 03:36 GMT

బంగారం ధరలు మండిపోతున్నాయి. తగ్గినట్లే తగ్గుతూ ఊరించి మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న మార్కెట్ నిపుణుల అంచనాలు నిజమయ్యేటట్లు కనిపిస్తున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పరుగులు తీస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలోనే బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ ఏడాది చుక్కలు చూపించిన బంగారం, వెండి ధరలు వచ్చే ఏడాది కూడా అదే స్థాయిలో పరుగులు పెడతాయని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. బంగారం, వెండి ధరలు వచ్చే ఏడాదికి మరింతగా పెరిగే అవకాశముందని అంటున్నారు.

ఇప్పట్లో తగ్గేలా లేదని...
బంగారం ధర ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. పైగా వచ్చే ఏడాది మరింత పెరిగి కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ప్రపంచ స్వర్ణ మండలి అంచనా వేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 5,000 డాలర్ల స్థాయికి చేరవచ్చని డబ్ల్యూజీసీ సీఈఓ డేవిడ్‌ టైట్‌ జోస్యం చెప్పారు. దుబాయ్‌లో జరిగిన ప్రీషియస్‌ మెటల్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. గత అక్టోబరులో ఔన్స్ 31.10 గ్రాములు బంగారం ధర 4,381 డాలర్ల వద్ద ఆల్‌టైం రికార్డు సృష్టించగా, ప్రస్తుతం 4,150 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. రానున్న రోజుల్లో ఈ పరుగు కొనసాగి, వచ్చే ఏడాదిలో 5,000 డాలర్ల మార్కును తాకవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండటం, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా సంక్షోభంలోకి జారుకుంటుండటం వంటి అంశాలు బంగారం ధరకు మద్దతుగా నిలుస్తాయని టైట్ వివరించారు.
నేటి ధరలు...
దీనికి తోడు, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున పసిడిని కొనుగోలు చేయడం, జపాన్‌లో అధిక ద్రవ్యోల్బణం కూడా బులియన్ మార్కెట్‌కు కలిసొస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అదేస్థాయిలో పెరగడం విశేషం. పది గ్రాముల బంగారం ధర 730 రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు నమోదయిన హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,17,760 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,28,470 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,83,100 రూపాయలకు చేరుకుంది. మధ్యాహ్నానికి ధరల్లో భారీ మార్పులుండే అవకాశముంది.


Tags:    

Similar News