RBI : భారీ ఊరట.. గృహాలు, వాహనాల రుణాలు తీసుకున్నారా? మీకొక గుడ్ న్యూస్

గృహాలకు, వాహనాలకు రుణాలు తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2025-06-06 05:06 GMT

గృహాలకు, వాహనాలకు రుణాలు తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. కీలకమైన వడ్డీరేట్ల ను ఆర్బీఐ మూడోసారి సవరించింది. ఈసారి రెపోరేటును ఏకంగా యాభై బేసిస్ పాయింట్ల మేరకు తగ్గించింది. ఆర్.బి.ఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ మేరకు ప్రకటించారు. దీంతో రెపో రేటు ఆరు శాతం నుంచి 5.50 శాతానికి తగ్గించడంతో గృహాలకు, వాహానాలు, ఇతర అవసరాల కోసం తీసుకున్న రుణాలపై వడ్డీ భారం తగ్గనుందని చెబుతున్నారు.

ద్రవ్యపరపదవి విదాన కమిటీ...
ద్రవ్యపరపదవి విదాన కమిటీ నిర్ణయాలను ఆర్.బి.ఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లించారు. కేంద్ర బ్యాంకు ఇరవైఐదు బేిస్ పాయింట్ల మీరకు తగ్గించడంతో ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ ప్రకటనతో రుణాల వడ్డీ భారం మరింత ప్రజలకు తగ్గనుంది. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా , స్థిరంగా కొనసాగుతుందని ఆర్.బి.ఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. పెట్టుబడి దారులకు మరిన్ని అవకాశాలు కల్పిస్తోందని ఆయన చెప్పారు.


Tags:    

Similar News