Mobile Tariff: ఇక బాదుడే.. పెరగనున్న మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు

మొబైల్‌ చార్జీలకు మళ్లీ రెక్కలు రాబోతున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తోంది టెక్‌ నిపుణుల నుంచి. గత రెండు సంవత్సరాలుగా

Update: 2024-03-26 10:29 GMT

Mobile tariff

మొబైల్‌ చార్జీలకు మళ్లీ రెక్కలు రాబోతున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తోంది టెక్‌ నిపుణుల నుంచి. గత రెండు సంవత్సరాలుగా ఛార్జీలు పెంచని టెలికాం కంపెనీలు ఇప్పుడు ఎన్నికల తర్వాత ఛార్జీలు పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో టెలికం సంస్థ తమ టారిఫ్‌లను 15 శాతం నుంచి 20 శాతం వరకు పెంచే అవకాశాలు ఉన్నాయని బ్రోకరేజ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్‌ ధరల పెంపుపై సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాయని, దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఇవి పూర్తి అయిన తర్వాతనే పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కస్టమర్‌ నుంచి వచ్చే సరాసరి ఆదాయం పెంచుకోవడంలో భాగంగా మరోసారి కస్టమర్లపై భారం మోపడానికి సిద్ధమవుతున్నాయి.

అయితే ఎంట్రీ లెవల్‌ కస్టమర్ల కోసం టెలికం సంస్థలు ప్రత్యేక ధరల్లో ప్లాన్లను ప్రకటించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. 4జీ, 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి టెలికం సంస్థలు ఇష్టానుసారంగా టారిఫ్‌ ప్లాన్ల ధరల్లో మార్పులు చేస్తున్నాయి. దీని కారణంగా వినియోగదారులకు మరింత భారం కలుగుతోందని, దీంతో టెలికం సంస్థలు వీరికోసం ప్రత్యేక ప్లాన్లను తీసుకురావాలని చెబుతున్నారు.

Tags:    

Similar News