Business News : ఒక ఫ్లాట్ 500 కోట్లు.. ఎక్కడంటే?

ఢిల్లీలోని గురుగావ్ లో నిర్మస్తున్న అపార్ట్ మెంట్లలో ఒక ఫ్లాట్ ధర ఐదు వందల కోట్ల రూాపాయలుగా నిర్ణయించారు

Update: 2025-09-30 06:06 GMT

ఒక ఫ్లాట్ ధర మామూలుగా అయితే రెండు లేదా మూడు కోట్లు ఉండవచ్చు. కానీ ఒక ఫ్లాట్ ధర ఐదు వందల కోట్ల రూపాయలు ధర పలకడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఢిల్లీలోని గురుగ్రామ్ లో డీఎల్ఎఫ్ సంస్థ సంస్థ నిర్మిస్తున్న కామెలియాస్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ధర వంద కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు సన్స్టిక్ రియాల్టీ నిర్మించబోతున్న అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ ధర కనిష్ఠంగా వంద కోట్లు, గరిష్ఠంగా ఐదు వందల కోట్ల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు.

విలాసవంతమైన నిర్మాణాలతో...
ఎమాన్సే బ్రాండ్ పై అత్యంత విలాసవంతంగా నిర్మించబోయే ఈ నివాస సముదాయాలు ముంబయి, దుబాయిలలో ఉంటాయని.. ఈ రెండు ప్రాజెక్టులపైనే దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆశిస్తున్నామని సస్ స్టిక్ రియాల్టీ సీఎండీ కమల్ ఖేతన్ వెల్లడించారు. మరి ఈ ఫ్లాట్ ను సొంతం చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారన్నది ఆసక్తి కరంగా మారింది.


Tags:    

Similar News