Muhurat Trading : నేడు మూరత్ ట్రేడింగ్
దీపావళి పండగ సందర్భంగా పెట్టుబడి పెట్టేవారు మంచి రోజుగా భావిస్తారు.
దీపావళి పండగ సందర్భంగా పెట్టుబడి పెట్టేవారు మంచి రోజుగా భావిస్తారు. మూరత్ ట్రేడింగ్ లో పాల్గొనేందుకు ఎక్కువ మంది మక్కువ చూపుతారు. దీపావళి పండగ సందర్భంగా స్టాక్ ఎక్సేంజిలు మూరత్ ట్రేడింగ్ పేరిట స్పెషల్ సెషన్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటాయి. ఈరోజు మూరత్ ట్రేడింగ్ జరగనుంది. గంటసేపు జరగనున్న ఈ మూరత్ ట్రేడింగ్ లో ఎక్కువ మంది మదుపరులు పాల్గొంటారు.
పెట్టుబడి పెట్టేవారికి...
ఈరోజు మధ్యాహ్నం 1.45 గంటల నుంచి 2.45 గంటల మధ్య మూరత్ ట్రేడింగ్ జరగనుంది. అయితే ట్రేడ్ మాడిఫికేషన్ కు 2.55 గంటల వరకూ సమయం ఉంటుందని నేషనల్ స్టాక్ ఎక్సేంజి ప్రకటించింది. మంగళవారం సాధారణ మార్కెట్ కు సెలవు దినం. ఈరోజు పెట్టుబడులు పెడితే శుభప్రదమని ఎక్కువ మంది భావిస్తారు. అందుకే ఈరోజు మూరత్ ట్రేడింగ్ లో ఎక్కువ మంది పాల్గొననున్నారు.