Gold Prices : ఇలా పెరుగుతూ పోవడమేనా.. ఆనందం ఆవిరికాక తప్పదా?

బంగారం ధరలు మరింత ప్రియం అవుతాయని ముందుగానే మార్కెట్ నిపుణులు హెచ్చరించారు

Update: 2023-12-08 03:51 GMT

బంగారం ధరలు మరింత ప్రియం అవుతాయని ముందుగానే మార్కెట్ నిపుణులు హెచ్చరించారు. ఆ హెచ్చరికల ప్రకారమే బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత పెరిగే అవకాశముందని ముందుగానే చెప్పడంతో కొందరు ఎగబడి బంగారాన్ని కొనుగోలు చేశారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరల ప్రకారం, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో తరచూ హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి.

ధరలు వరసగా...
ప్రధానంగా మధ్య తరగతి ప్రజలు బంగారం కొనుగోలు చేయాలంటే భయపడి పోతున్నారు. ధరలు ఎక్కువ కావడంతో ఆందోళన చెందుతున్న వారికి ఏ మాత్రం ఊరట లభించడం లేదు. వరసగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బంగారం అంటే మహిళకు ఎంతో ఇష్టమో చెప్పాల్సిన పనిలేదు. తమ కిష్టమైన వస్తువును కొనుగోలు చేయడానికి ప్రతి అవసరాన్ని ఉపయోగించుకుంటారు. అందుకే జ్యుయలరీ దుకాణాలు ఎప్పుడూ కొనుగోలుదారులతో కిటికటలాడుతూనే ఉంటాయి.
వెండి మాత్రం...
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగానే పెరిగాయి. కొంతలో కొంత ఊరట అని చె్పోకోవాలి. వెండి ధరలు మాత్రం తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,550 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,780 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధరలపై ధరలు బాగానే తగ్గాయి. వెయ్యి రూపాయల వరకూ తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 80,000 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News