మీరు ప్రయాణిస్తున్న రైలు నుంచి ఫోన్‌ పడిపోయిందా? ఇలా చేస్తే ఫోన్ మీ ఇంటికొచ్చేస్తుంది

Indian Railways: ఇండియన్‌ రైల్వే.. ఇది దేశంలోని అతిపెద్ద రవాణా వ్యవస్థ. భారత రైల్వే ద్వారా ప్రతిరోజు లక్షలాది మంది ..

Update: 2023-11-21 14:15 GMT

Indian Railways: ఇండియన్‌ రైల్వే.. ఇది దేశంలోని అతిపెద్ద రవాణా వ్యవస్థ. భారత రైల్వే ద్వారా ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. సామాన్యులు సైతం ఎక్కువ రైలు ప్రయాణం చేస్తుంటారు. అందుకు కారణం బస్సు ఛార్జీల కంటే తక్కువగా ఉండడమే. రైలు ప్రయాణం అంటే చాలా మందికి ఇష్టం. ఎందుకంటే అటవీ ప్రాంతాల్లో రైలు వెళ్లడం.. అందుకే పచ్చిన బైళ్లు, మైదానాలు కనిపిస్తుండటంతో ప్రకృతిని ఆస్వాదిస్తుంటారు. మీ జీవితంలోని ప్రధానమైన ఆనందాన్ని అనుభవిస్తూ, సుందరమైన దృశ్యాలు కిటికీలను చూస్తుండగా మీ ఫోన్ వేగంగా కదులుతున్న రైలు నుండి పడిపోయిందనుకోండి. మీరేం చేస్తారు? రైలును ఆపడానికి మీరు చైన్‌ లాగేందుకు ప్రయత్నిస్తారు. ఒకవేళ చైన్‌ లాగినా అందుకు జరిమానా, కేసును అనుభవించాల్సి ఉంటుంది. లేదా చేసేదేమీ లేక అలాగే ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. లేకుంటే మీ ఫోన్‌ పడిపోయిన ప్రాంతం మరో స్టేషన్‌ సమీపంలో ఉంటే ఇక్కడ దిగి వెతికేందుకు ప్రయత్నిస్తుంటారు.

ఇలా చాలాసార్లు ప్రయాణికుల నిర్లక్ష్యం కారణంగానో, సెల్ఫీలు దిగుతుండగనే ప్రయణిస్తున్న రైలు నుంచి మొబైల్, పర్సు, వాచ్ వంటి విలువైన వస్తువులు పడిపోతుంటాయి. కానీ మీ ఫోన్‌ సేఫ్ గా ఇంటికి రావాలంటే ఇలా చేస్తే సరిపోతుంది. ఏ కారణం చేతనైనా మీ మొబైల్ ఫోన్ లేదా పర్స్ రైలు నుండి పడిపోయినట్లయితే.. ముందుగా మీరు ట్రాక్ పక్కన ఉన్న పోల్‌పై పసుపు, నలుపు రంగులలో రాసిన నంబర్‌ను నోట్ చేసుకోవడం తప్పనిసరి. ఈ పోల్ నంబర్ మీ వస్తువులను, ఫోన్‌ను గుర్తించడంలో సహాయపడుతుంది.


Full View


ఆ తర్వాత రైల్లో ఉండే ఇతరుల ఫోన్‌ తీసుకుని ట్రైన్‌ ఎక్కడుందో ఎగ్జాటిగా ట్రాక్‌ చేయండి. ఆ తర్వాత 139 నంబర్‌కు కాల్ చేస్తే రైల్వేకు సంబంధించిన హెల్ఫ్‌ లైన్‌ సెంటర్‌కు వెళ్తుంది. ఇక్కడ ఉండే సిబ్బందికి మీ ఫోన్‌ పడిపోయిన స్తంబం నంబర్‌, ప్రదేశం, మీ అడ్రస్‌ను తదితర వివరాలు తెలుపండి. వారు వెంటనే మీరు చెప్పిన వివరాల ప్రకారం.. ఫోన్‌ పడిపోయిన ప్రాంతం సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్‌కు సమాచారం అందిస్తారు. అక్కడున్న సిబ్బందిని మీ ఫోన్‌ను వెతికేందుకు పంపిస్తారు. పోయిన వస్తువులు ఖచ్చితంగా దొరుకుతాయని పోలీసులు హామీ ఇవ్వలేరు గానీ.. ఈ గ్యాప్‌లో ఫోన్‌ను ఎవ్వరు తీసుకోకుండా ఉంటే వెతికి మీ అడ్రస్‌కు కొరియర్‌ చేస్తారు. సో.. రైలు ప్రయాణంలో ఏవైనా విలువైన వస్తువు పడిపోయినట్లయితే ఇలా చేయడం ద్వారా మీ వస్తువులను సులభంగా ఇంటికి వచ్చేలా చేయవచ్చు.

Tags:    

Similar News