రైతులకు మోడీ సర్కార్‌ నుంచి అద్భుతమైన స్కీమ్‌.. నెలకు రూ.3000 పెన్షన్‌

Monthly Pension Scheme: కేంద్రంలోని మోడీ సర్కార్‌ రైతుల కోసం రకరకాల పథకాలను అందిస్తోంది. ఇప్పటికే రైతులకు

Update: 2024-01-18 14:41 GMT

Monthly Pension

Monthly Pension Scheme: కేంద్రంలోని మోడీ సర్కార్‌ రైతుల కోసం రకరకాల పథకాలను అందిస్తోంది. ఇప్పటికే రైతులకు పీఎం కిసాన్‌ స్కీమ్‌ అందిస్తుండగా, ఈ పథకాల్లో పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన కూడా ఒకటి. కిసాన్ సమ్మాన్ నిధి యోజన, ప్రధానమంత్రి కిసాన్ మనధన్ యోజన రెండూ భిన్నమైనవి. కానీ రెండూ పథకాలను కూడా 2019లోనే ప్రారంభం అయ్యాయి. పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద ప్రభుత్వం రైతులకు వ్యవసాయం కోసం సంవత్సరానికి రూ.6,000 అందజేస్తుంది. అయితే, పీఎం కిసాన్ మనధన్ యోజన కింద చిన్న రైతులకు నెలవారీ రూ.3,000 పెన్షన్ అందిస్తోంది.

పీఎం కిసాన్ మనధన్ యోజన అంటే ఏమిటి?

ఈ పథ గురించి తెలుసుకుంటే.. ఇందులో రెండు హెక్టార్లు లేదా ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల రైతులు పీఎం కిసాన్ మనధన్ యోజనలో నమోదు చేసుకోవడానికి అర్హులు. ప్రస్తుతం ఈ పథకంలో 19,47,588 మంది రైతులు నమోదు చేసుకున్నారని కేంద్ర మంత్రిత్వశాఖ నివేదికలు చెబుతున్నాయి.

అర్హులైన రైతులు ఎంత డిపాజిట్‌ చేయాలంటే..

ఈ పీఎం కిసాన్‌ మ్‌ధన్‌ యోజనలో అర్హులైన రైతులు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు పింఛను నిధికి జమ చేయాల్సి ఉంటుంది. మీరు 18 సంవత్సరాల వయస్సులో ఈ పథకాన్ని ప్రారంభించినట్లయితే మీరు నెలకు కనీసం రూ.55 చెల్లించాల్సి ఉంటుందని గుర్తించుకోవాలి. అదే. మీరు 40 సంవత్సరాల వయస్సులో పథకాన్ని తీసుకున్నట్లయితే మీరు నెలకు కనీసం రూ. 200 చెల్లించాలి. 60 ఏళ్లు వచ్చే వరకు ప్రతి నెలా పెన్షన్ ఫండ్‌లో జమ చేస్తుండాలి. ఆ తర్వాత రైతులు నెలవారీ పింఛను రూ.3,000 లేదా అంతకంటే ఎక్కువ పొందవచ్చు.

ఎలా నమోదు చేసుకోవాలి?

రైతులు తమ సమీపంలో ఉన్న రైతు సంప్రదింపు సెంటర్‌కు వెళ్లాలి. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేసుకోవాలి. రైతుల వయస్సు ప్రకారం, వారు చెల్లించాల్సిన కనీస మొత్తం ఎంతో తెలియజేస్తారు. ఆ తర్వాత ప్రతి నెలా కూడా ఎస్‌బీ ఖాతా నుంచి కొంత మొత్తం పెన్షన్‌ ఫండ్‌కు చేరుతుంది. పథకంలో నమోదు చేసుకున్న తర్వాత, రైతుల కోసం ప్రత్యేక కిసాన్ పెన్షన్ ఖాతా సంఖ్య (KPAN) జనరేట్‌ అవుతుంది. ఆ తర్వాత కిసాన్ కార్డు జారీ చేస్తారు అధికారులు.

Tags:    

Similar News