ఎన్నికల వేళ..హెలికాప్టర్, చార్టర్డ్ విమానాలకు గంటకు అద్దె ఎంతో తెలుసా?

ప్రస్తుతం దేశంలో ఎన్నికలు రానున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు బిజీబిజీగా గడుపుతారు. అయితే ఎన్నికలు

Update: 2024-03-15 07:07 GMT

Helicopter

ప్రస్తుతం దేశంలో ఎన్నికలు రానున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు బిజీబిజీగా గడుపుతారు. అయితే ఎన్నికలు రాగానే తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రచారం చేసేలా ప్లాన్‌ చేస్తుంటారు ఆయా పార్టీల నాయకులు. ఎన్నికల్లో అడ్డగోలుగా ఖర్చు పెడుతుంటారు. ఎంత ఖర్చు అయినా పెట్టేందుకు సిద్ధమవుతుంటారు. చాలా పార్టీలు తక్కువ సమయంలో ఎక్కువ నియోజకవర్గాలు, అసెంబ్లీలను కవర్ చేయాలని ప్లాన్ చేస్తుంటారు నేతలు. జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వరకు చాలా మంది నేతలు తమ ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్లను వినియోగించుకుంటారు. ఈ ట్రెండ్‌ మరింతగా పెరిగిపోతోంది.

గతంలో వాహనాలను వినియోగించే నేతలు ఇప్పుడు కొత్త ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు. దీంతో హెలికాప్టర్లకు డిమాండ్ పెరగడంతో పాటు అద్దె కూడా భారీగా పెరిగింది. మరీ ముఖ్యంగా ఎన్నికల బరిలో నిలిచే రాజకీయ నాయకులకు, ప్రధాన పార్టీల ముఖ్య నేతలకు ప్రచారం సవాల్‌గా మారింది. చాలా పార్టీలు తక్కువ సమయంలో ఎక్కువ నియోజకవర్గాలు, అసెంబ్లీలను కవర్ చేయాలని ప్లాన్ చేస్తున్నాయి.

Full View

హెలికాప్టర్‌ అద్దె ఎంత ఉంటుంది?

ఎన్నికల నేపథ్యంలో చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్లకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం చార్టర్డ్ విమానానికి గంటకు రూ.4.5 లక్షల నుంచి రూ.5.25 లక్షల వరకు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక హెలికాప్టర్‌కు గంటకు 1.5 లక్షల నుంచి రూ. 3.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం దేశంలో 350 చార్టర్డ్ విమానాలు, 175 హెలికాప్టర్లు ఉన్నాయని నివేదికల ద్వారా తెలుస్తోంది.

ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలకు భారీగా ఖర్చు చేసే రాజకీయ పార్టీలు,.. ఎన్నికలకు నెల రోజుల ముందు ప్రచారం చేసేవారు. అయితే ఇప్పుడు అద్దెకు హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలు అందుబాటులోకి రావడంతో నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే విస్తృత ప్రచారం మొదలుపెడుతున్నారు. ఎన్నికల కోసం పార్టీల ఖర్చులకు ఈసారి చార్టర్డ్ ఫ్లైట్, హెలికాప్టర్ అద్దె కూడా తోడైంది. ప్రచార బడ్జెట్ కూడా భారీగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా ఖర్చు భారీగా పెడుతూ తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రచారం జరిగేలా ప్లాన్‌ చేస్తున్నారు రాజకీయ నేతలు.

Tags:    

Similar News