Google Play Store:ప్లేస్టోర్‌ నుంచి యాప్స్‌ తొలగింపుపై కేంద్రం రియాక్షన్‌.. వెనక్కి తగ్గిన గూగుల్‌.. కారణం ఏంటంటే

గత రెండు రోజుల కిందట గూగుల్‌ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 10 భారతీయ యాప్‌లను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది.

Update: 2024-03-04 07:31 GMT

Google

Google Play Store:గత రెండు రోజుల కిందట గూగుల్‌ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 10 భారతీయ యాప్‌లను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. అందుకు కారణం లేకపోలేదు. ఈ యాప్ డెవలపర్లు తమ మార్గదర్శకాలను పాటించడం లేదని, అందుకే ఈ చర్య తీసుకుంటున్నామని సెర్చ్ ఇంజన్ కంపెనీ తెలిపింది. Google Play Store చెల్లింపు విధానాన్ని గూగుల్‌ అప్‌డేట్‌ చేసింది. ఈ భారతీయ కంపెనీలు ప్లే స్టోర్ సర్వీస్ ఫీజును చెల్లించలేదు. దీంతో ఆగ్రహించిన గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి ఈ 10 భారతీయ యాప్‌లను తొలగించేసింది. గూగుల్‌కి సేవా రుసుము చెల్లించడంలో ఈ కంపెనీలు నిరంతరం విఫలమయ్యాయి. సేవా రుసుములకు సంబంధించి భారతీయ స్టార్టప్, గూగుల్ మధ్య వివాదం నడుస్తోంది. గూగుల్ సర్వీస్ ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నాయని స్టార్టప్ చెబుతోంది. ఈ యాప్స్‌ తొలగింపు విషయంలో మంత్రి అశ్విని వైష్ణవ్‌ జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు గూగుల్‌ దిగొచ్చింది. యాప్స్‌ను పునరుద్దరిస్తామని తెలిపింది.

తొలగించిన యాప్స్ ఇవే..

1. ALT Balaji

2. Bharat Matrimony

3. Naukri

4. 99 Acres

5. Kuku FM

6. Quack-Quack

7. Shaadi . Com

8. Stage

9. Truly Madly

10. Stage OTT

కేంద్రం రియాక్షన్‌పై గూగుల్‌ వెనక్కి..

ఇదిలా ఉండగా, ఈ భారతీయ యాప్స్‌ ప్లేస్టోర్‌ నుంచి తొలగించడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఐటి మంత్రి వైష్ణవ్ ఈ యాప్స్‌ విషయంలో మాట్లాడారు. సమస్యను పరిష్కరించడానికి గూగుల్‌తో సమావేశానికి పిలిచినట్లు, స్టార్టప్‌ కంపెనీలకు సహాయంగా ఉంటామని తెలిపారు. గూగుల్‌ ప్రతినిధులను ఈ విషయం పిలిచినట్లు చెప్పారు. అయితే కేంద్రం రియాక్షన్‌పై గూగుల్‌ వెనక్కి తగ్గింది. యప్స్‌ను పునరుద్దరిస్తామని తెలిపింది. సర్వీస్ ఫీజులకు సంబంధించిన వివాదంతో ప్లే స్టోర్ నుండి తొలగించిన భారతీయ యాప్‌లను పునరుద్ధరించడానికి అంగీకరించింది. 94% ఫోన్‌లు దాని ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడినందున భారతీయ మార్కెట్‌ను గూగుల్ ఆధిపత్యం చేస్తుంది.

Tags:    

Similar News