Gold Price Today : ఈ రేంజ్ లో బంగారం, వెండి ధరలు పెరిగితే?
బంగారం ధరలు మరింత పెరుగుతున్నాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి
బంగారం ధరలు మరింత పెరుగుతున్నాయి. పరుగు కొనసాగుతూనే ఉంది. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర లక్షా ముప్ఫయి వేల రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర రెండు లక్షల రూపాయలు దాటేసింది. రానున్న కాలంలో మరింతగా ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు వేసిన అంచనాలు నిజమవుతున్నట్లే కనిపిస్తున్నాయి. ధరలు ఇంకా ఎంత పెరుగుతాయన్నది అంచనాలకు కూడా అందడం లేదు. అందుకే బంగారం, వెండి పై పెట్టుబడి కోసం జనం పరుగులు పెడుతున్నారు. వీలయినంత వరకూ త్వరగా లాభాలు ఆర్జించాలని ఎక్కువ మంది వెండి కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు.
వెండి కొనుగోళ్లు...
బంగారం కంటే వెండి కొనుగోళ్లు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయని వ్యాపారులు కూడా చెబుతున్నారు. కిలో వెండి రెండు లక్షల రూపాయలు దాటడంతో మరింత పెరిగే అవకాశముందని భావించి దానిపై ఎక్కువగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఇక ఈ రేంజ్ లో ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ విధించిన అదనపు సుంకాలతో పాటు బంగారం, వెండి దిగుమతులు కూడా తగ్గుదల, పెరిగిన డిమాండ్ వంటి కారణాలు బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణాలుగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
స్వల్పంగా పెరిగినా...
పెళ్లిళ్లు సీజన్ తో పాటు పండగలు కూడా వస్తుండటంతో ధరలు మరింత పెరుగుతాయని అంచనాలు వినపడుతున్నాయి. దీపావళి, థన్ తెరాస్ కారణంగా ధరలు మరింత పెరుగుతాయన్న ప్రచారం మార్కెట్ వర్గాల్లో జరుగుతుంది. ఈరోజు దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర పై కూడ స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,18,640 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,29,430 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,05,900 రూపాయలకు చేరుకుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.