Gold Rates Today : గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. బరువెక్కిన వెండి ధరలు
బంగారం ధరలు మరింత పెరుగుతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు
బంగారం ధరలు మరింత పెరుగుతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే గత కొన్నాళ్ల నుంచి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీపావళి పండగ సమయానికి ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు కొనుగోలుకు జంకుతున్నారు. ఇదే సమయంలో ప్రస్తుతం పెళ్లిళ్లు, పండగలు సీజన్ నడుస్తుండటంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగానే బంగారం, వెండి ధరలు పెరిగిపోతున్నాయి. పెరగడం కాదు.. బంగారాన్ని ముట్టుకుంటే మండిపోతుంది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా అదే స్థాయిలో పరుగులు పెడుతున్నాయి.
గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్
మార్కెట్ లో అదనపు పన్నులు కూడా బంగారం ధరపై భారంగా మారాయి. ఎంతలా అంటే తరుగు అనేది కాకుండా జీఎస్టీ కూడా పడుతుండటంతో బులియన్ మార్కెట్ లో ఉన్న బంగారం కంటే ఎక్కువగా ధరలు చెల్లించాల్సి వస్తుంది. దీంతో వినియోగదారులు బంగారాన్ని, వెండి ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. అలాగే కొనుగోళ్లు తగ్గడంతో జ్యుయలరీ దుకాణాలు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. యాభై శాతం డిస్కౌంట్ అంటూ కొన్ని కార్పొరేట్ సంస్థలు ఊదరగొడుతున్నాయి. అయితే కండిషన్స్ అప్లయ్ అంటూ మరొక మెలిక పెడుతున్నాయి. కొనుగోలు చేసిన తర్వాత కానీ షరతులు ఏంటో తెలియడం లేదు. అందుకే బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.