Gold Rates Today : పసిడి ప్రియులారా.. పారా హుషార్.. గుడ్ న్యూస్ నేడు కొనండి
ఈరోజు దేశంలో బంగారం ధరలు కొంత తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి
బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేం. అలాగని తగ్గుతాయని కూడా అనుకోలేం. ఎందుకంటే పెరిగినప్పుడు బంగారం ధరలు భారీగా పెరుగుతాయి. తగ్గినప్పుడు మాత్రం తక్కువగా ధరలు తగ్గుతుంటాయి. దీంతో బంగారం, వెండి ధరలు వినియోగదారులు అనుకున్న రేంజ్ కు వచ్చే అవకాశం లేదు. అలాగని పెరగదని కూడా చెప్పలేం. ఎందుకంటే గత కొన్నిరోజులుగా బంగారం, వెండి ధరల పెరుగుదలను చూస్తుంటే.. ఎక్కువ సార్లు పెరగడం, తక్కువ సార్లు తగ్గడం చూశాం. అందుకే బంగారాన్ని కొనుగోలు చేసేవారు ఎవరైనా సరే ధరలతో సంబంధం లేకుండా చూడాల్సి ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయినా బంగారం ఎప్పుడూ నష్టాన్ని తెచ్చిపెట్టదని కూడా హామీ ఇస్తున్నారు.
అత్యంత ఇష్టపడే...
బంగారం అంటే మహిళలకు అత్యంత ఇష్టం. అలాగే పురుషులకు కూడా పెట్టుబడిగా చూస్తారు. దీంతో ఈ కాంబినేషన్ వల్లనే బంగారం, వెండి కొనుగోళ్లు భారతదేశంలో ఎక్కువగా జరుగుతుంటాయి. అదే సమయంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు కూడా బంగారం డిమాండ్ ను ఎప్పటికీ తగ్గించవు. ధరల పెరుగుదలతో సంబంధం లేకుండా కొనుగోలు చేసే వస్తువు ఒక్కటే ఒక్కటి అది బంగారం మాత్రమే. అందుకే బంగారం విషయంలో బిందాస్ గా ఉండాలని అందరూ చెబుతుంటారు. అయితే బంగారం, వెండి ధరలు పెరగడానికి కేవలం దేశీయ మార్కెట్ లకు సంబంధం లేదు. అంతర్జాతీయ పరిణామాలను బట్టి వాటి ధరలు నిత్యం మారుతూనే ఉంటాయి. అందుకే బంగారం ధరలను ఎప్పటికీ అంచనాలు వేయలేం.
నేటి ధరలు ఇలా..
ఇక పెట్టుబడి పెట్టేవారు సయితం బంగారం ధరలు దిగివస్తే కొనుగోలు చేయాలని చూస్తారు. ఎక్కువ ధరను వచ్చినప్పుడు విక్రయిస్తుంటారు. అలా బంగారం మార్పిడి వీరివల్లనే భారతదేశంలో ఎక్కువగా జరుగుతుంటుంది. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం నిల్వలు భారత్ లోని మహిళల వద్దనే ఉన్నాయంటారు.ఈరోజు దేశంలో బంగారం ధరలు కొంత తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,15,040 రూపాయల వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,25,550 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,73,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.