Gold Prices Today : గుడ్ న్యూస్.. పసిడి ప్రియులకు ఊరట
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది
బంగారం ధరలు ఒకరోజు పెరిగితే.. మరొకరోజు దిగి వస్తున్నాయి. అయితే ధరలు స్వల్పంగానే పెరుగుతున్నాయి. అలాగే కొద్దిగానే తగ్గుతున్నాయి. బంగారం, వెండి ధరలు నిన్న మొన్నటి వరకూ తారాజువ్వల్లా పైకి లేచి ఎవరికీ అందనంత దూరంలో నిలిచాయి. బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయాలంటే సామాన్యులకు సాధ్యమయ్యే పని కాదు. నిన్నటి వరకూ ఆ రేంజ్ లో ధరలు పెరిగాయి. గత ఏడాది జనవరి లో ప్రారంభమయిన బంగారం, వెండి ధరలు ఈ ఏడాది జనవరి నెల చివర వరకూ కొనసాగాయి. అయితే ఫిబ్రవరిలో మాత్రం కొంత ధరలు తగ్గుముఖం పట్టాయి. భారీగా బంగారం, వెండి ధరలు పతనమయినప్పటికీ ఇంకా అందుబాటులోకి రాలేదు.
బంగారం అంటే...
బంగారం అంటే అందరికీ మక్కువే. అలాగని డబ్బులు అప్పులు చేసి కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగంగా బంగారం, వెండి కి ప్రత్యేక స్థానం ఉంది. సంప్రదాయంగా వస్తున్నఆచారాలను నేటికీ చాలా మంది అనుసరిస్తున్నారు. శుభకార్యాలకు తప్పనిసరిగా బంగారం, వెండి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. పెళ్లిళ్లకు ఖచ్చితంగా గ్రాము బంగారాన్ని అయినా కొనుగోలు చేయాల్సిందే. నిన్న మొన్నటి వరకూ చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా బంగారం, వెండి కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఇప్పుడు అవసరమయితే తప్ప బంగారం, వెండి కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
నేటి ధరలు...
ధరలు అంతగా పెరిగి ప్రజలను భయపెడుతున్నాయి. ఇక పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభం కానుండటంతో బంగారం, వెండి ధరలు పతాక స్థాయికి వెళతాయని అంచనాలున్నాయి. అయితే ధరలు మాత్రం కొంత దిగివస్తున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,40,890 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,53,700 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 2,79,900 రూపాయలకు చేరుకుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు రావచ్చు.