Gold Prices Today : బంగారం ఇక అందుబాటులోకి వస్తుందా.. వెండి చేరువవుతుందా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి
బంగారం ధరలు నిన్న మొన్నటి వరకూ వినియోగదారులకు చుక్కలను చూపించాయి. వెండి ధరలు అందకుండా పోయాయి. అలాంటి సమయంలో గత వారం రోజుల నుంచి ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే బంగారం, వెండి కొనుగోలుకు కొంత అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. ధరలు భారీగా తగ్గకపోయినప్పటికీ చాలా వరకూ అంతకు ముందుతో పోలిస్తే ధరలు తగ్గాయి. ఇప్పుడే జ్యుయలరీ దుకాణాలు కూడా వినియోగదారులతో కళకళలాడుతున్నాయి. నిన్నటి వరకూ దుకాణాలకు వచ్చి ధరలను చూసి వెనక్కు వెళ్లేవారు ఇప్పుడు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు. అయితే ధరలు ఇంకా తగ్గే అవకాశముందని వేచి చూసే వారు కూడా ఎక్కువగా ఉన్నారు.
ధరల్లో మార్పునకు...
బంగారం వెండి ధరల మార్పు అనేక కారణాలతో జరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్ ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ ఇటీవల తీసుకున్న నిర్ణయాలు, అమెరికాతో వివిధ దేశాలకు మధ్య కుదురుతున్న వాణిజ్య ఒప్పందం వంటివి ధరలలో మార్పునుకు కారణమని చెబుతున్నారు. అయితే రానున్న కాలంలో ధరలు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని, అందుకే ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా బంగారం, వెండి ధరలు తగ్గుతాయని వేచి చూస్తే పెరిగే అవకాశముందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అవసరమున్న వారు కొనుగోలు చేయాలని చెబుతున్నారు.
నిలకడగానే ధరలు...
పెళ్లిళ్ల సీజన్ తో పాటు వచ్చే కాలమంతా శుభకార్యాలు ఉండటంతో ధరలు మరింత పెరిగే అవకాశముందన్న హెచ్చరికలు వినిపిస్తున్న నేపథ్యంలో కనుగోలు దారులు కొంత బంగారం, వెండి వస్తువులను సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగరాం ధర 1,43,550 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,56,600 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2, 85,500 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.