Gold Price Today : సంక్రాంతి ముందు బంగారం ప్రియులకు అదిరే న్యూస్

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి

Update: 2026-01-08 03:33 GMT

బంగారం ధరలు మరింత పెరుగుతాయి. వెండి ధరలు పరుగులు పెడతాయి. రోజులతో సంబంధం లేదు. క్యాలెండర్లు మారుతున్నప్పటికీ బంగారం శాంతిస్తుందన్న నమ్మకం లేదు. బంగారం పై అలాంటి అభిప్రాయం అందరిలోనూ ఉంది. కానీ వెండి విషయంలో మాత్రం అంచనాలు తప్పుతున్నాయి. వెండిపై పెట్టుబడి పెట్టిన వారు కొన్ని సార్లు నష్టాలను చవి చూశారు. కొందరు లాభాలను చూశారు. బంగారం విషయంలో మాత్రం అలా కాదు. బంగారంపై పెట్టుబడితో నష్టం అనేది ఉండదు. ఎందుకంటే ధరలు పెరగడమే తప్పించి తగ్గడం అనేది జరగదు. అదే సమయంలో వెండి విషయంలో అప్ డౌన్ గా ధరలు సాగుతుండటంతో కొంత మదుపరులు భయపడుతున్నారు.

భద్రత ఉంటుందనే...
బంగారం, వెండి సంస్కృతి సంప్రదాయాలకు కేరాఫ్. సనాతన సంప్రదాయాల మేరకు బంగారం, వెండి వస్తువులకు ఎప్పుడూ గిరాకీ తగ్గదు. సీజన్ తో సంబంధం లేకుండా ధరలు పెరగడమే కాకుండా అమ్మకాలు జరిగే ఏకైక వస్తువు బంగారం, వెండి మాత్రమే. బంగారం శరీరంపై ఆభరణాలుగా, వెండి ఇంట్లో కనిపించే విలువైన వస్తువులుగా చూడటం ప్రారంభమైన నాటి నుంచి వీటి విలువ మరింత పెరుగుతుంది. కొన్ని దశాబ్దాల నుంచి బంగారం, వెండి ధరల పెరుగుదలను చూసిన వారికి ఎవరికైనా ఇదే అర్థమవుతుంది. ఎందుకంటే బంగారం అనేది తమ వద్ద ఉంటే భద్రత ఉంటుందన్న నమ్మకం అందరిలోనూ కలగడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు.
నేటి ధరలు...
రానున్న కాలంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.22 క్యారెట్ల పది గ్రాముల బంగాంర ధర 1,26,740 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,38,260 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,77,100 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News