Gold Prices Today : షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న పసిడి.. ధర ఎంతో తెలుసా?
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వెండి కూడా బంగారంతో పాటు పరుగులు పెడుతుంది
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వెండి కూడా బంగారంతో పాటు పరుగులు పెడుతుంది. దీంతో పెళ్లిళ్ల సీజన్ మొదలయిన వెంటనే బంగారం, వెండి ధరలు మరింత పెరగనున్నాయన్న మార్కెట్ నిపుణుల అంచనా నిజమయ్యేటట్లు కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకూ బంగారం, వెండి ధరలు కొంత దిగి రావడంతో వినియోగదారులు ఊరట చెందారు. ఇంకా ధరలు తగ్గుతాయన్న ఆశతో ఉన్నారు. అలాంటి ఆశలపై బంగారం, వెండి నీళ్లు చల్లింది. ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. గత మూడు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు భారీ పెరుగుదలకు నోచుకుంటుండటంతో మరోసారి అమ్మకాలపై ప్రభావం పడుతుందని జ్యుయలరీ దుకాణాల యజమాన్యం ఆందోళన చెందుతుంది.
ధరల పెరుగుదలకు...
దేశంలో బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జరిగే పరిణామాలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడం వంటి కారణాలు కూడా బంగారం ధరలపై ప్రభావం పడిందని చెబుతున్నారు. ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించే అదనపు సుంకాల ప్రభావం కూడా బంగారం, వెండి ధరలపై ఉంటుంది. పెళ్లిళ్ల సీజన్ మొదలయ్యే నాటికి బంగారం, వెండి ధరలు పెరగడంతో కొనుగోలు చేయాల్సిన వారు ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి వరకూ కిటకిటలాడిన జ్యుయలరీ దుకాణాలు తిరిగి నెమ్మదించాయి.
నేటి ధరలు...
అయితే బంగారం, వెండి ధరలపై పెట్టుబడి పెట్టిన వారు మాత్రం కొంత ఖుషీగా ఉన్నారు. తాము పెట్టిన సొమ్ముకు లాభం రాకపోయినా.. నష్టం రాదన్న నమ్మకం వారిలో పెరిగింది. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై 1,900 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై ఐదు వేల రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,46,000 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,59,280 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 2,90,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మరింత మార్పు రావచ్చు.