Gold Prices Today : మళ్లీ పరుగు అందుకున్న పసిడి.. అందనంత దూరంలో వెండి
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు భారీగా పెరిగింది
పసిడి ధరలు పరుగు లంకించుకున్నాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతున్న బంగారం ధరల్లో మళ్లీ పెరుగుదల మొదలయింది. సీజన్ ప్రారంభం కావడంతో పాటు ఎక్కువగా కొనుగోళ్లు జరగడం డిమాండ్ పెరగడంతోనే బంగారం ధరలు మళ్లీ ప్రియమవుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత కొంత కాలంగా బంగారం ధరలు దిగి వస్తుండటంతో మరింతగా పతనమవుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ వారి అంచనాలకుర భిన్నంగా ధరలు మళ్లీ పెరుగుతుండటంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. గత రెండు నుంచి మూడు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు మరింతగా పెరుగుతూ వినియోగదారులను నిరాశకు గురి చేస్తున్నాయి.
బంగారం ధరల్లో అందుకే పెరుగుదల...
ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేపట్టడంతోనే బంగారం ధరకు రెక్కలు వచ్చాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్ అన్నారు. ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో లేవన్నారు. ఈ పరిణామాలను ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు గమనిస్తోందని చెప్పారు. ఇక ఇటీవల అమెరికా సుంకాల్లో మార్పుల ప్రభావాన్ని భారత ఆర్థిక వ్యవస్థపై అంచనా వేయడం చాలా తొందరపాటు అవుతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలోనూ బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపిస్తుందని వ్యాపార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు.
నేటి ధరలు ఇలా...
పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతోనే బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. డిమాండ్ పెరగడమే కాకుండా దిగుమతులు కూడా తగినన్ని లేకపోవడంతోనే ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు భారీగా పెరిగింది. పది గ్రాముల బంగారం ధరపై రెండు వేల రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై పది వేల రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,47,910 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,61,360 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 3,00,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.