Gold Rates Today : షాక్ లు మీద షాకులిస్తున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంత పెరిగిందంటే?

దేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది

Update: 2025-07-04 03:26 GMT

ఆషాడమాసం అంటే బంగారం కొనుగోళ్లు తగ్గుతాయి. ఎవరూ ఈ మాసంలో బంగారాన్ని పెద్దగా కొనుగోలు చేయడానికి ఇష్టపడరు. ఆషాఢమాసమయినా సరే.. డిమాండ్ లేకపోయినా సరే.. కొనుగోళ్లు సరిగా లేకున్నా సరే... ధరలు మాత్రం పెరగడం ఆగడం లేదు. ప్రతి రోజూ బంగారం, వెండి ధరలు పెరుగుతూ ఉసూరమనిపిస్తున్నాయి. ఊరట కలిగిస్తాయని భావిస్తే తిరిగి పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ధరలు పెరుగుతూనే ఉండటంతో ఇప్పటికే లక్షకు చేరువలో బంగారం ఉంది. వెండి ధరలు కూడా మండిపోతున్నాయి. ధరలు అందుబాటులోకి రాకపోవడంతో పసిడిప్రియులు బంగారం కొనుగోలు చేయడానికి వెనకంజ వేస్తున్నారు.

ధరలు మరింత పెరుగుతాయని...
బంగారం అనేది అపురూపమైన వస్తువుగా మారింది. కొందరికే ఇది సొంత మయ్యే అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పటికే బంగారానికి, వెండికి కొన్ని వర్గాలు దూరమయ్యాయి. ధరలు మరింత పెరిగే అవకాశముండటంతో ఎగువ మధ్యతరగతి ప్రజలు కూడా బంగారాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవచ్చు. సాధారణంగా అమ్మకాల్లో ఊపు పెరగాలంటే మిడిల్ క్లాస్ కొనుగోలు చేస్తేనే ఏ వస్తువు అయినా ఇట్టే అమ్ముడవుతుంది. కానీ ఇప్పుడు ఆ వర్గానికి దూరం కావడంతో ఇక బంగారం సంపన్నులకే సొంతమవుతుంది. భారీగా పెరిగిన ధరలను చూసి అస్సలు బంగారం కొనుగోలు అన్న మాటను కూడా మర్చిపోయే పరిస్థితులు ఉన్నాయంటే అతి శయోక్తి కాదు.
స్వల్పంగా పెరిగినా...
బంగారం అంటే ఒక స్టేటస్ సింబల్ మాత్రమే కాదు. సెంటిమెంట్ కూడా . భారతదేశంలోనూ అందులోనూ దక్షిణ భారతదేశంలో సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా బంగారం పురాతన కాలం నుంచి మారిపోవడంతో దానికి అంత విలువ ఉంది. తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 91,060 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 99,340 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. కిలో వెండి ధర 1,21,100 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News