Gold Price Today : లక్ష రూపాయలను టచ్ చేస్తున్న బంగారం ధరలు.. మిడిల్ క్లాస్ ఇక దూరమే
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా పెరుగుదల కనిపించింది
బంగారం ధరలు అందకుండా పోతున్నాయి. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. మరోసారి లక్ష రూపాయలకు చేరువకు బంగారం ధరలు చేరుకున్నాయి. మే నెలలో లక్ష రూపాయలు టచ్ చేసిన పది గ్రాముల బంగారం ధర తిరిగి ఇప్పుడు లక్ష రూపాయలకు చేరువలో ఉంది. క్రమంగా ధరలు పెరుగుతూ వినియోగదారులకు షాక్ లు మీద షాక్ లు ఇస్తున్నాయి. బంగారం ధరలు యాభై వేలకు పడిపోతుందని ఎవరు చెప్పారో గాని వారి అంచనాలు మాత్రం నిజం కావడం లేదు. మార్కెట్ నిపుణుల అంచనాల మేరకు ధరలు పెరుగుతూ పోతున్నాయి. ధరలను అదుపు చేయడం ఎవరి చేతుల్లో లేకపోవడంతో వినియోగదారులు కూడా పెరుగుతున్న ధరలను చూసి అలా ఉంటున్నారంతే.
విలువైన వస్తువుగా మారి...
బంగారం ధరలు ఎంత పెరిగితే అంత క్రేజ్ ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ విలువైన వస్తువుగా మారితే కొందరికే అది సొంతమవుతుంది. బంగారం ధరలు పెరిగితే కొనేవారు కొందరే ఉంటారు. ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేస్తేనే ఎక్కువ అమ్మకాలు జరుగుతాయి. గ్రాము నుంచి పది గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేసేది మిడిల్ క్లాస్ వారే. కానీ అలాంటిది ఆ వర్గమే బంగారానికి దూరమయింది. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లిళ్ల సీజన్ కూడా ముగియనుంది. మూఢమి వస్తుండటంతో ఇక శుభకార్యాలకు కూడా కొంత కాలం ఫుల్ స్టాప్ పడతాయి. ఇక ధరలు కూడా పెరిగిపోతుండటంతో ఇక అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయే అవకాశముందన్న ఆందోళన వ్యాపారుల్లో నెలకొంది.
స్వల్పంగా పెరిగి...
బంగారం అంటే ఇష్టపడని వారు చాలా కొద్ది మంది ఉంటారు. కానీ ఇప్పుడు ధరలతో బంగారం అంటే ఇష్టమున్నా దానిని కొనుగోలు చేయలేని పరిస్థితి. అంత ధర వెచ్చించి కొనుగోలు చేయడం అనవసరమన్న భావన ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతుంది. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 90,810 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 99,070 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర 1,00,100 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.