Gold Price Today : గుడ్ న్యూస్.. నేడు బంగారం కొనేసేయండి... లేకుంటే...తర్వాత బాధపడిపోతారంతే

నేడు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు నిలకడగానే ఉన్నాయి.

Update: 2025-06-01 03:30 GMT

బంగారం ధరలు పైపైకి వెళుతుంటాయి. సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. మధ్యతరగతి ప్రజలకు కూడా భారంగా మారాయి. అయితే కొద్దిసార్లు ధరలు తగ్గుతుంటాయి. ఎక్కువ సార్లు బంగారం ధరలు పెరుగుతుంటాయి. సీజన్ తో సంబంధం లేకుండా, డిమాండ్ తో పని లేకుండా ధరలు పెరిగేది ఒక్క బంగారం విషయంలోనే. ఎందుకంటే బంగారం ధరల మార్పులు ఈ రెండింటికీ సంబంధం ఉండదు. అంతర్జాతీయ పరిణామాలు ధరలపై ప్రభావం చూపుతాయి. అందుకే బంగారం ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? అన్న అంచనాలు ఎవరూ వేయలేరు. ఒకరు యాభైఐదు వేల రూపాయలకుపది గ్రాముల బంగారం ధర పడిపోతుందని చేసిన వ్యాఖ్యలు కూడా అలాగే చూడాలి.

సీజన్ ముగియనుండటంతో...
అదే సమయంలో లక్ష రూపాయలను టచ్ చేసిన బంగారం తిరిగి క్రమంగా దిగి వస్తుంది. ఇక మరో వారం రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ ముగియనుంది. సీజన్ ముగిసిన తర్వాత ఇక బంగారం గురించి ఆలోచించే వారు కూడా లేరు. గతంలో ఏ సందర్భంలోనైనా బంగారాన్ని కొనుగోలు చేయడానికి ముందుకువచ్చేవారు. కానీ నేడు పెళ్లిళ్ల సమయంలోనూ బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆలోచన చేయాల్సి వస్తుంది. అందుకే బంగారం, వెండి వస్తువులను సొంతం చేసుకోవాలని మనసులో ఉన్నప్పటికీ వాటి ధరలను చూసి మాత్రం వెనకడుగు వేస్తున్నారు. ధరలు పెరగడంతో పాటు సీజన్ కూడా ముగియపోనుండటంతో ఇక బంగారం కొనుగోళ్లు దారుణంగా పడిపోయే అవకాశముందని అంచనాలు వినిపిస్తున్నాయి.
నిలకడగానే ధరలు...
బంగారం అంటే ఇప్పుడు అరుదైన వస్తువుగా మారింది. స్టేటస్ సింబల్ గా చూసినప్పటికీ పెట్టుబడి పెట్టే వారు సయితం బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడంతో అమ్మకాలు నిలిచిపోయాయి. ఈ ఏడాది అంతా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నేడు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు నిలకడగానే ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయం ఆరు గంటలకు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89,200 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 97,310 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,10,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News