Gold Rates Today : ఒకరకంగా తీపికబురే..బంగారం ధరలు పెరగలేదు

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు నిలకడగా ఉన్నాయి.

Update: 2025-05-18 03:48 GMT

బంగారం ధరలు కొంత తగ్గుముఖం పడతాయని భావించిన వారికి ప్రతిరోజూ నిరాశ ఎదురవుతుంది. గత కొద్ది రోజుల నుంచి ధరలు తగ్గుతున్నప్పటికీ పది గ్రాములపై పది రూపాయలు మాత్రమే తగ్గుతూ వస్తుంది. ఎక్కువసార్లు ధరలు పెరిగి షాకిచ్చిన బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయని భావించి కొనుగోళ్లను ఎక్కువ మంది నిలిపివేశారు. దీంతో పాటు వెండి ధరలు కూడా పెరగడంతో పాటు వాటి అమ్మకాలు కూడా దాదాపుగా స్థంభించిపోయాయి. జ్యుయలరీ దుకాణాలలో తెచ్చిన సరుకు తెచ్చినట్లే ఉంది. అరకొర తప్పించి పెద్దగా షాపులకు జనం రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఇంత దారుణంగా అమ్మకాలు పడిపోయిన రోజులు గతంలో ఎన్నడూ చూడలేదని దుకాణాల యజమానులు చెబుతున్నారు.

అనేక అంశాలతో...
అయితే బంగారం ధరలు ఊరికే పెరగవు. వాటి పెరుగుదల, తగ్గుదల ఎవరి చేతిలోనూ ఉండవు. ఎందుకంటే అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. లక్ష రూపాయలకు పైకి చేరిన బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నప్పటికీ ఇంకా అందుబాటులోకి రాలేకపోవడంతో ఇంకా కొనుగోళ్లు మాత్రం ఊపందుకోలేదు. అదే సమయంలో బంగారం మీద పెట్టుబడి పెట్టే వారు కూడా కొంత జంకుతున్నారు. బంగారం ధరలు అమాంతం పెరగడంతో ధరలు తగ్గితే నష్టం వస్తుందేమోనన్న ఆందోళనతో వారు కూడా బంగారాన్ని కొనుగోలు చేయడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.
నేటి ధరలు...
పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ వారికి కావాల్సినంత మేరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అందుకే గత సీజన్ తో పోలిస్తే బంగారం అమ్మకాలు దాదాపు డెబ్భయి శాతం వరకూ పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఇలా ఉన్నాయి. మధ్యాహ్నానికి ఈ ధరలు పెరిగవచ్చు. తగ్గవచ్చు. లేకుంటే స్థిరంగా ఉండవచ్చు. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,200 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 95,130 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,08,000 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News