Gold Price Today : గుడ్ న్యూస్.. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో కనుక్కోని కొనుక్కోండి

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగా ఉన్నాయి

Update: 2025-04-27 03:43 GMT

బంగారం ధరలు మరింత పెరుగుతున్నాయి. గోల్డ్ అనేది ఎవరికి అందకుండా పోతుంది. వెండి కూడా పరుగులు తీస్తుంది. రెండు పోటీ పడుతున్నట్లే కనిపిస్తున్నాయి. బంగారం, వెండి ధరలు ఇంత స్థాయిలో పెరుగుదల మరెప్పుడూ కనిపించలేదు. ఇప్పటికే అంచనాలను అధిగమించిన బంగారం ధరలు ఇంకా పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. బంగారం, వెండి కొనుగోలు చేయడం ఇప్పుడు సామాన్య విషయం కాదు. ధరలకు అదనంగా జీఎస్టీతో పాటు పన్నులు కూడా వసూలు చేస్తుండటంతో కొనుగోలు దారులపై మరింత భారం పడుతుంది. దీంతో కొనుగోలు దారులు చాలా వరకూ బంగారం కొనుగోలు చేయడానికి అనాసక్తి చూపుతున్నారు.

కొనుగోలు చేయడానికి...
పెళ్లిళ్ల సీజన్ తో పాటు ఇప్పుడు అక్షర తృతీయ కూడా వస్తుండటంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. అయితే పెళ్లిళ్లకయినా, అక్షర తృతీయ కయినా బంగారాన్ని కొనుగోలు చేయాలంటే తమ వద్ద స్థోమత సరిపోవాలి కదా? అని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది మొదటి తేదీ నుంచి ప్రారంభమయిన ధరలు అప్పుడప్పుడు కొంత తగ్గినట్లు కనిపించినా ఎక్కువ సార్లు పెరుగుదలతో వినియోగదారులకు షాక్ లు ఇస్తున్నాయి. ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరువలో ఉంది. అంత ధరలను పెట్టి కొనుగోలు చేయలేక వినియోగదారులు దుకాణాలకు వచ్చి ధరలను కొనుక్కుని వెనుదిరుగుతున్నారు.
ధరలు ఇలా...
బంగారం ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఏ స్థాయిలో పెరుగుతాయన్నది తాము చెప్పలేమని అంటున్నారు. అదే సమయంలో దిగుమతులు మాత్రం విదేశాల నుంచి భారీగానే బంగారం వస్తున్నప్పటికీ డిమాండ్ కు సరిపడా బంగారం నిల్వలు లేకపోవడంతోనే ధరలు పెరుగుతున్నాయంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయం ఆరు గంటలకు నమోదయిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 90,020 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 98,210 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,11,900 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News