Gold Rates Today : మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఈరోజు ఎంత పెరిగాయంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి
బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగారం ధరలు భారీగా తగ్గితే ఆశ్చర్యం కానీ, పెరిగితే ఆశ్చర్యం అనేది ఇప్పడు కలగడం లేదు. ధరల పెరుగుదలకు గత ఆరు నెలల నుంచి బంగారు ప్రియులు అలవాటు పడిపోయారు. ధర ఎంత పెరిగిందని చూడటమే తప్ప కొనుగోలుకు ఎవరూ మొగ్గు చూపడం లేదు. మొన్నటి వరకూ కాస్త దిగువకు చూసిన బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగు అందుకోవడంతో ధరలు ఇంకెంత స్థాయికి వెళతాయోనన్న ఆందోళన ఇటు వ్యాపారుల్లోనూ, అటు వినియోగదారుల్లోనూ నెలకొంది. ధరలు పెరిగితే కొనుగోళ్లు భారీగా తగ్గుతాయని, అందుకే ధరలు అందుబాటులోకి రావాలనిజ్యుయలరీ దుకాణ యాజమానులు కూడా కోరుకుంటున్నారు.
శ్రావణ మాసంలో...
ఆషాఢమాసం ముగిసి శ్రావణ మాసం ప్రారంభయితే మళ్లీ ధరలు ఇంకా పెరిగే అవకాశముందన్న అంచనాలు వినపడుతున్నాయి. ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తుండటంతో బంగారాన్ని కొనుగోలు చేయరు. దీనికి తోడు రానున్న శ్రావణ మాసంలో ధరలుమరింత పెరిగే అవకాశముందని భావించిన పెట్టుబడిదారులు మాత్రం కొంత కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. దీంతో అడపా దడపా వ్యాపారాలు జరుగుతున్నాయి. అయితే ఎక్కువ మంది బంగారు ఆభరణాల కంటే బంగారు బిస్కెట్ల కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. ఆభరణాలు కొంటే తరుగు,మేకింగ్ ఛార్జీలంటూ అదనపు రుసుంవసూలు చేస్తుండటంతో ఆభరణాల విక్రయాలు గణనీయంగా తగ్గాయి.
వచ్చే నెలలో మరింతగా...
శ్రావణ మాసంలో అంటే వచ్చే నెల మొదటి వారం నుంచి బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడే కొనుగోల చేయడం మంచిదని సూచిస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయం ఆరు గంటలకు నమోదయిన వివరాలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 90,660 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 98,900 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,19,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.