Gold Price Today : బంగారం ప్రియులకు బ్యాడ్ లక్.. ధరలు అస్సలు తగ్గడం లేదుగా? ఏడాదంతా అంతేనా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి

Update: 2025-07-11 03:20 GMT

బంగారాన్ని కొనుగోలు చేయాలంటే ఇప్పుడు ఆస్తులు అమ్ముకోవాల్సిందే. లక్షలు సంపాదించేవారు సయితం బంగారాన్ని కొనుగోలు చేయాలంటే ఇప్పుడు కొంత వెనుకంజ వేస్తున్నారు. ఎందుకంటే ఇంత ధరను పెట్టి బంగారాన్ని కొనుగోలు చేయడం అవసరమా? అన్న భావన మెదళ్లను తొలుస్తుంది. అలా కొనుగోలు చేసిన బంగారాన్ని పెట్టెలోనో, బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం తప్పించి ఉపయోగం లేదని, అదే మొత్తాన్ని ప్రత్యామ్నాయంగా మరొక దానిలో పెడితే కొంత లాభాలను అయినా చూడవచ్చన్న అభిప్రాయం ప్రజల్లో క్రమంగా బలపడుతుంది. ఇంత పెరిగిన బంగారం ధరలు తగ్గవని చెప్పడానికి ఎవరి వద్ద నిశ్చితమైన, నిఖార్సయిన ఆధారాలు లభించడం లేదు.

దిగువకు చూడటం లేదు...
అనుకున్నట్లుగానే బంగారం ధరలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఆల్ టైమ్ హైకి చేరుకుంటున్నాయి. ఆషాఢమాసమయినా ధరల విషయంలో ఏ మాత్రం దిగువకు చూడటం లేదు. ఇక ఈనెల 25వ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఆరోజు నుంచి ఇక పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతుంది. దాదాపు నవంబరు వరకూ పెళ్లిళ్లతో పాటు శుభముహూర్తాలు కూడా ఉండటంతో డిసెంబరు నెల వరకూ బంగారం ధరలు తగ్గవని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే 2025 ఏడాది ప్రారంభం నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు డిసెంబరు వరకూ అంటే ఏడాది అంతా కొనసాగుతాయని ఇక దాదాపు ఖరరాయినట్లే.
ధరలు పెరిగి...
బంగారం అంటే ఒకప్పుడు పెళ్లిళ్లకు, శుభకార్యాలకు ఎక్కువ కొనుగోలు చేసేవారు. కానీ పెరిగిన ధరలతో బంగారం పెట్టుబడులకు కూడా కొంత స్వస్తి చెప్పినట్లు కనపడుతుంది. అందుకే పెరిగిన ధరల ప్రభావం అమ్మకాలపై పడింది. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరగగా, కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 90,210 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 98,410 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,19,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.







Tags:    

Similar News