Gold Price Today : మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు .. నేటి గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది.

Update: 2025-06-12 03:40 GMT

బంగారం ధరలు మరింత ప్రియమవుతాయన్న హెచ్చరికలు నిజమవుతాయని అనిపిస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం, వెండి ధరలు అసలు తగ్గడం అనేది జరగదంటున్నారు. తగ్గినా పది రూపాయలు పది గ్రాములపై తగ్గుతుంది తప్పించి ఎక్కువ తగ్గుతుందని ఆశించడం కూడా అత్యాశే అవుతుందని మార్కెట్ నిపుణులు కూడా చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి గిరాకీ ఎప్పుడూ తగ్గదు. ధరలు ఎంత పెరిగినా దానిని సొంతం చేసుకునే వారు అధికంగానే ఉంటారు. అదే సమయంలో బంగారం, వెండి వస్తువులను భారత్ లో సెంటిమెంట్ గా భావించే వారు అధికంగా ఉండటంతో ఎప్పటికప్పుడు ధరలు పెరుగుతున్నా దాని డిమాండ్ మాత్రం తగ్గదంటున్నారు.

ఇంకా పెరుగుతాయని...
ఏప్రిల్ నెలలో లక్ష రూపాయలు దాటేసిన బంగారం ధరలు తర్వాత క్రమంగా దిగిరావడం ప్రారంభించాయి. అయినా లక్ష రూపాయలకు చేరువలోనే పదిగ్రాముల ధర ఉంది కాని అంతకు మించి అధికంగా ధరలు మాత్రం తగ్గలేదు. ఎందుకంటే పసిడిని కొనుగోలు చేయడం అంటే ఒక క్రేజ్ గా భావించే వారు పెద్దమొత్తంలో కాకపోయినా తమ స్థోమతను బట్టి కొనుగోలు చేస్తుండటంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇక ఈ ఏడాది ప్రారంభమయిన నాటి నుంచి ధరల పరుగు ఆగడం లేదు. వెండి ధరలు కూడా అదే సమయంలో పరుగులు పసిడితో సమానంగా పెడుతుండటంతో రెండింటి ధరలు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయి.
డిమాండ్ తగ్గని వస్తువు...
మార్కెట్ లో డిమాండ్ తగ్గని వస్తువు ఏదైనా ఉందంటే అది బంగారం ఒక్కటేనని అందరూ అంగీకరిస్తారు. అందుకే బంగారం, వెండి వస్తువుల క్రయవిక్రయాలకు ఒక సీజన్ లేకుండా పోయిందని మార్కెట్ నిపుణులు సయితం అంగీకరిస్తారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 90,210 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 98,410 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధరలు 1,18,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Tags:    

Similar News