Gold Price Today : మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో తెలిస్తే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది
బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. బంగారం, వెండి ధరలు పెరగడం కామన్ అయిపోయింది. గత కొద్ది రోజులుగా ధరలు పెరుగుతున్నప్పటికీ ఈ మధ్య మూడు రోజుల నుంచి స్వల్పంగా ధరలు దిగి రావడంతో ఇంకా ధరలు పతనమవుతాయని అంచనా వేశారు. కానీ ఆ అంచనాలు ఏవీ నిజమయ్యేటట్లు కనిపించడం లేదు. బంగారం విషయంలో ధరలు భారీగా తగ్గుతాయని అంచనాలు పెట్టుకోవడం అనవసరమని మార్కెట్ నిపుణులు చెబుతున్న మాటలు వాస్తవమే. ఎందుకంటే ధరలు పెరగడమే తప్పించి బంగారం విషయంలో భారీగా తగ్గి మనకు అందుబాటులోకి వస్తాయని అనుకోవడం కూడా అత్యాశ అవుతుందని వ్యాపారులు కూడా చెబుతున్నారు.
విక్రయాలపై ప్రభావం...
పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నప్పటికీ ధరలు భారీగా పెరగడంతో బంగారం విక్రయాలు మాత్రం ఊపందుకోలేదు. మరొక వైపు ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేద్దామని వెయిట్ చేస్తున్న వారు ఇక కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. పెట్టుబడిగా పెట్టే వారు కూడా బంగారంపై డబ్బులు పెడితే తగ్గుతాయేమోనన్న ఆందోళనతో కొంత వెనక్కు తగ్గారు. ఇలా అన్ని రకాలుగా బంగారం, వెండి వస్తువుల కొనుగోలు విషయంలో వినియోగదారులు ఆచి తూచి అడుగులు వేస్తుండటంతో పాటు ధరలు మాట ఎలా ఉన్నప్పటికీ కొనుగోళ్లు మాత్రం ఆశించినంత లేకపోవడంతో జ్యుయలరీ దుకాణాల నిర్వహణ కూడా కష్టసాధ్యమవుతుందని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.
నేటి ధరలు...
బంగారాన్ని కొనుగోలు చేయడం ఇప్పుడు ఆషామాషీ కాదు. గ్రాము బంగారం కొనుగోలు చేయాలంటే పర్సు నిండా డబ్బు ఉండాలి. లేదంటే అప్పు చేసి కొనాలి. అది చేయడం మాత్రం అసాధ్యం కావడంతో బంగారం క్రయవిక్రాయాలపై ఈ ఏడాది భారీగా ప్రభావం చూపుతుంది. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,560 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 98,100 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,08,000 రూపాయలుగా కొనసాగుతుంది.