Gold Price Today : మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. శాంతించిన వెండి ధరలు

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కొంత తగ్గుదల కనిపించింది

Update: 2025-05-17 03:34 GMT

పసిడికి ధరలు పెరగడమే తప్ప దిగిరావడం అనేది తెలియదనే అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు విన్నా బంగారం ధరలు పెరిగాయన్న వార్తలు మాత్రమే ఎక్కువ సార్లు వింటుంటాం. అతి తక్కువ సార్లు మాత్రమే తగ్గాయని మన చెవులకు వినపడుతుంటాయి. అందుకే బంగారం ధరలు పెరిగాయంటే పెద్దగా ఆశ్చర్యపోవడం లేదు. అదే సమయంలో ధరలు ఎంత ఉన్నాయన్న సమాచారం తెలుసుకుని దానికి అనుగుణంగా కొనుగోలు చేయడానికి వినియోగదారులు సిద్ధమవుతున్నారు. అందుకే పసిడి ధరలు పెరుగుతున్న సమయంలో మాత్రం అమ్మకాలపై పడుతుందని, తమ వ్యాపారాలు ఈ ఏడాది ఆరంభం నుంచి సక్రమంగా సాగడం లేదని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.

తగ్గుతాయేమోనని...
బంగారం కొన్ని రోజుల క్రితం లక్ష రూపాయలు టచ్ చేసి మళ్లీ దిగి వచ్చినప్పటికీ ఇంకా ధరలు అందుబాటులోకి రాలేదు. అందుకే బంగారం, వెండి కొనుగోళ్లు ఊపందుకోలేదు. బంగారం ధరలు ఇంకా తగ్గుతాయేమోనని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయవచ్చులే అన్న భావనలో ఎక్కువ మంది ఉన్నారు. గతంలో పుట్టిన రోజులు, పండగలు, పబ్బాలకు కూడా బంగారు ఆభరణాలను బహుమతిగా ఇచ్చుకునే వారు. కానీ ఇప్పుడు గిఫ్ట్ లు మాట పక్కన పెట్టి సొంతానికి, అవసరాలకు కూడా కొనుగోలు చేయడం కష్టంగా మారుతుంది. అందుకే ధరలు పెరుగుతూ వినియోగదారులను బంగారానికి దూరం చేస్తున్నాయని చెప్పవచ్చు.
నేటి ధరలు...
బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూనే ఉంటాయి. వెండి కంచం కొనుగోలు చేద్దామని వెళ్లే వారికి కూడా అక్కడి ధరలు చూసి వెనక్కు మళ్లుతున్నారు. గత నాలుగైదు నెలల నుంచి అమ్మకాలు మరింతగా తగ్గాయని వ్యాపారులు లబోదిబో మంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కొంత తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయం ఆరు గంటలకు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,210 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 95,140 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,07,900 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News